పొంగల్ ఫైట్‌లో ‘బంగార్రాజు’ కూడా ఉంటాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అందుకే తగ్గట్టే సినిమాను వేగంగా కంప్లీట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు చిత్రబృందం ప్రచారం కూడా మొదలెట్టేసింది. అయితే పొంగల్‌కు రెండు సినిమాలు ఉంటేనే ‘బంగార్రాజు’ను రంగంలోకి దింపాలని నాగ్ అనుకున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు ‘భీమ్లా’ మారడం లేదు. దీంతో ‘బంగార్రాజు’ స్టెప్ ఏంటని చూస్తున్నారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా.. బాగుంటే ప్రేక్షకుల చూస్తారు అంటుంటారు.
గతంలో కొన్ని సందర్భాల్లో ఇలా జరిగింది కూడా. ఇప్పుడు అదే ఆలోచనతో నాగార్జున సంక్రాంతి బరిలో మూడో సినిమాగా తన ‘బంగార్రాజు’ను పెట్టాలని అనుకున్నారు. అయితే ‘భీమ్లా నాయక్’ తిరిగి ట్రాక్‌లో వచ్చింది. ఇప్పుడు నాగార్జున ఏం చేస్తారు అనేదే ప్రశ్నగా మారింది. నాగ్ వెనకడుగు వేసి తర్వాత రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ నాగార్జున సంక్రాంతి బరి వద్దనుకుంటే… ఇంత త్వరగా సింగిల్ డేట్‌లు దొరకవు, దాంతోపాటు ఇంత మంచి సీజన్ కూడా దొరకదు.
సీనియర్ స్టార్ హీరోలు ఫిబ్రవరిని ఆక్రమించేశారు. దీంతో మళ్లీ నాగ్ సమ్మర్ బాట పట్టాల్సి ఉంటుంది. అయితే సినిమా నిర్మాణం విషయంలో కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాల్సి వస్తోందనే వాదనలూ ఉన్నాయి. నాగ్ ఇప్పుడు సంక్రాంతికి నాలుగో పుంజు అవుతాడా అనేది చూడాలి.