Viswa: బిగ్ బాస్ హౌస్ లో విశ్వ బ్లఫ్ చేశాడా..?

బిగ్ బాస్ సీజన్ 5 షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న విశ్వ.. మొదటినుంచి ఫిజికల్ టాస్క్ లంటే ముందుండేవారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఊహించని విధంగా అతడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బయటకొచ్చిన తరువాత విశ్వ ఓ లగ్జరీ కార్ కొనుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కారుతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ” మనం కలలు కన్న కారును కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం.

ఇప్పుడు నేను అదే ఫీలింగ్‌లో ఉన్నా.. మా కుటుంబంలో కొత్త మెంబర్ వచ్చింది.. దీనంతటికి కారణం ఆ దేవుడు, బిగ్ బాస్” అంటూ రాసుకొచ్చారు. విశ్వ ఇంత లగ్జరీ కారును కొనేయడంతో అంతా షాక్ అవుతున్నారు. నిజానికి విశ్వ హౌస్ లో ఉన్నంతకాలం తన ఆర్ధిక ఇబ్బందుల గురించి చాలా సార్లు మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది కూడా డబ్బు సంపాదించడానికే అని చెప్పారు. తన ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నానని.. కొడుక్కి ఫీజు కూడా కట్టలేని స్టేజ్ లో ఉన్నానని చెబుతూ ఎమోషనల్ అయిపోయారు.

కానీ ఇప్పుడు బయటకొచ్చిన తరువాత దాదాపు రూ.60 లక్షల విలువైన కారుని కొనడంతో నెటిజన్లు ఆయన్ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే ఆర్ధిక కష్టాలు ఉంటే ఇంత లగ్జరీ కారు కొనలేరని.. సింపతీ కోసం హౌస్ లో విశ్వ బ్లఫ్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ పై విశ్వ స్పందిస్తాడేమో చూడాలి!

1

2

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus