సినిమా హీరో అంటే.. నీట్ షేవ్ అని అనేవారు. అయితే ఇది కొన్నాళ్లు మాత్రమే నడిచింది. ఆ నడిచిన రోజుల్లో మాస్ సినిమాలకు కూడా హీరో దాదాపు ఇలానే ఉండేవారు, మేనరిజమ్స్‌లో మాత్రమే మార్పులు ఉండేవి. ఆ తర్వాత మాస్ సినిమాలు అంటే హీరో లుక్ మీద దృష్టి పెట్టడం ప్రారంభించారు. అలా కాస్త గడ్డం పెరిగింది, జుట్టు హైట్ కూడా పెరుగుతూ వచ్చింది. రీసెంట్‌గా అయితే గుబురు గడ్డం, పొడవాటి జుట్టు కామన్ పాయింట్ అయిపోయింది.
కావాలంటే మీరే చూడండి గత కొన్ని రోజులుగా హీరోలకు సంబంధించి వస్తున్న లుక్స్‌లో ఈ పాయింట్లు కామన్ అయిపోయాయి. క్లాస్ లుక్‌లో కొన్ని ప్రేమ కథలు చేసి, ఆ తర్వాత అదే లుక్‌లో మాస్ సినిమాలు చేసిన అఖిల్ (Akhil Akkineni).. ఇప్పుడు ‘లెనిన్’ (Lenin) అంటూ పూర్తి మాస్ లుక్‌లో మాస్ కథతో వస్తున్నాడు. ఈ సినిమా టీజర్, పోస్టర్‌లో అఖిల్ లుక్‌లో గుబురు గడ్డం కనిపిస్తోంది. కాస్త వెనక్కి వెళ్తే ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం రామ్‌చరణ్ (Ram Charan) కూడా ఇలానే ఉన్నాడు.
ఆట కూలీ పెద్దిగా కనిపించబోతున్నాడు. రా అండ్ రస్టిక్ లుక్‌లో భాగంగా చరణ్ గుబురు గడ్డంతోనే కనిపించనున్నాడు. రాజమౌళి (Rajamouli) సినిమా కోసం మహేష్ బాబు (Mahesh Babu) కూడా కొన్ని సన్నివేశాల కోసం ఇలానే ఉంటాడు అని అంటున్నారు. తారక్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో సీనియర్ తారక్ లుక్‌లో గుబురు గడ్డం ఉంటుంది అని అంటున్నారు. ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లుక్ కూడా ఇలానే ఉంటుంది అని చెబుతున్నారు.
ఇక నాగచైతన్య (Naga Chaitanya) రీసెంట్ మూవీ ‘తండేల్’లో (Thandel) హీరో లుక్ ఇలానే ఉంటుంది. ‘పుష్ప’రాజ్ పాత్ర గురించి, ఆ గెడ్డం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. అలాగే ‘కుబేర’ (Kubera) సినిమా కోసం ధనుష్ (Dhanush)ఇలాంటి లుక్‌లో కనిపిస్తాడు. ఈ మేరకు పోస్టర్ బయటికొచ్చింది. ఇదంతా చూస్తుంటే ఈ లుక్‌లోకి మరికొంతమంది వచ్చే అవకాశముంది అని సమాచారం.