Beast Movie: బీస్ట్ రిలీజైతే మాత్రమే ఆ సందేహాలు తీరతాయా?

విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన బీస్ట్ మూవీ థియేటర్లలో మరో తొమ్మిది రోజుల్లో రిలీజ్ కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా అరబిక్ కుత్తు సాంగ్ వల్ల ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఇప్పటికే విడుదలైన బీస్ట్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ మూవీ ట్రైలర్ కు కొన్ని సినిమాలకు దగ్గరి పోలికలు ఉన్నాయని చెబుతున్నారు.

Click Here To Watch NOW

1993 సంవత్సరంలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా నిష్క‌ర్షలో హీరో ఒక భవనంలో బంధీలుగా ఉన్న జనంపై తన బృందంతో కలిసి ఎటాక్ చేస్తాడు. నిష్కర్ష సంఘటన పేరుతో తెలుగులో డబ్బింగ్ కావడంతో పాటు యూట్యూబ్ లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. మరోవైపు హాలీవుడ్ మూవీ అయిన మాల్ కాప్ అనే సినిమాకు బీస్ట్ కు దగ్గరి పోలికలు ఉన్నాయి. మాల్ కాప్ సినిమాలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసే హీరో హైజాకర్ల నుంచి అమాయక ప్రజలను కాపాడతాడు.

సూపర్ హిట్ వెబ్ సిరీస్ అయిన మనీ హెయిస్ట్ కు బీస్ట్ సినిమాకు దగ్గరి పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ కామెంట్ల గురించి దర్శకుడు నెల్సన్ ఎలా స్పందిస్తారో చూడాలి. బీస్ట్, కేజీఎఫ్2 ఒక్కరోజు తేడాతో థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక సినిమా రిజల్ట్ మరో సినిమా ఫలితంపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది. అయితే సినీ అభిమానులు మాత్రం ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.

రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేజీఎఫ్2 సినిమాపైనే ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus