Bedurulanka: హిట్టు కళ కనిపిస్తుంది..ఆర్.ఎక్స్.100 హీరోకి కలిసొచ్చేలా ఉంది!

‘ఆర్.ఎక్స్.100 ‘ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ను అందుకోలేదనే చెప్పాలి. కమర్షియల్ గా అతను నటించిన కొన్ని సినిమాలు యావరేజ్ రిజల్ట్ ను దక్కించుకున్నప్పటికీ.. కంటెంట్ పరంగా అంతంతమాత్రమే మెప్పించాయి. త్వరలో కార్తికేయ ‘బెదురులంక 2012’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నూతన దర్శకుడు క్లాక్స్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం.

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల అంటే ఆగస్టు 25 న విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన.. ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు మంచి స్పందన లభించింది. టీజర్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. 2 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగిన ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.

2012 డిసెంబర్ 21న యుగాంతం అంటూ గతంలో చాలా భయంకరమైన ప్రచారాలు జరిగాయి. అయితే అదే టైంలో ‘గోదావరి జిల్లాలకు చెందిన జనాలు ఎలాంటి భయాందోళనకు గురయ్యారు?’ ఆ టైంలో ఆ ఊరి పెద్దలు.. అక్కడి జనాలను ఎలా తప్పుదోవ పట్టించి వారి భయాన్ని చేసుకున్నారు?’ అనే థీమ్ తో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చెబుతుంది.

ఇందులో అజయ్ ఘోష్ పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది. కార్తికేయ – నేహా శెట్టి ల రొమాంటిక్ ట్రాక్ కూడా యూత్ ని ఆకర్షించే విధంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కి హైలెట్ అయ్యింది అని చెప్పొచ్చు.కార్తికేయ ఈ చిత్రంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కేలా ఉన్నాడు. (Bedurulanka) ‘బెదురులంక 2012 ‘ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus