Prabhas: ప్రభాస్ – రాజమౌళితో రాఘవేంద్ర రావు ప్లాన్ చేసిన సినిమా ఎందుకు ఆపేశారంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో, డైరెక్టర్ కాంబో, కథ సెట్ చేసి.. మూవీ ప్లాన్ చేయడం.. దాన్ని అనుకున్న విధంగా పూర్తి చేసి విడుదల చేయడం వెనుక ఎన్నో సస్పెన్స్, థ్రిల్లింగ్ సంఘటనలు జరుగుతుంటాయి.. ప్రకటించిన తర్వాత పక్కన పెట్టేసినవి.. హీరో, హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు మారిపోయినవి చాలా సినిమాలే ఉన్నాయి.. వాటిలో ప్రభాస్ – రాజమౌళి సినిమా కూడా ఒకటి.. ‘ఛత్రపతి’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిలిం తర్వాత దర్శకేంద్రుడు, రాజమౌళి గురువు కె. రాఘవేంద్ర రావు ఈ క్రేజీ కాంబోలో సినిమా సెట్ చేశారు.. ఆ విరాలు ఇప్పుడు చూద్దాం..

‘మగధీర’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాక.. తెలుగు సినిమాని సాంకేతికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి.. భారీ బడ్జెట్ చిత్రాలే కాదు.. స్మాల్ బడ్జెట్, స్టార్ హీరోనే కాదు చిన్న హీరో.. యాక్షనే కాదు కామెడీ కూడా చేస్తానంటూ అప్పుడు కామెడీ థ్రిల్లర్ ‘మర్యాద రామన్న’ మూవీని టేకాఫ్ చేశారు.. దీని తర్వాత ప్రభాస్‌ హీరోగా ‘విశ్వామిత్ర’ ప్లాన్ చేశారు.. అప్పటికి కథ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది..

‘ఛత్రపతి’ కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించి.. నటుడిగా (Prabhas) ప్రభాస్ స్థాయిని పెంచింది.. జక్కన్న దర్శకత్వప్రతిభకు నిలువుటద్దంలా నిలిచింది.. దీంతో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్, భారీ బడ్జెట్‌‌తో డార్లింగ్‌ని ‘విశ్వామిత్ర’ గా చూపించాలని సన్నాహాలు చేశారు.. రాజమౌళి – ప్రభాస్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిపోయే సినిమా చేయాలని విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథ రెడీ చేశారు.. రాఘవేంద్ర రావు కూడా ప్రాజెక్ట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు..

అయితే బడ్జెట్ పరంగా కాస్త సందేహించి వెనకడుగు వేశారట.. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో పెద్ద బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో బ్రహ్మాండంగా చేద్దామనుకుని అప్పటికి పక్కన పెట్టేశారు.. ఇది జరిగిన కొంత కాలానికి రాఘవేంద్ర రావు సమర్పణలో.. డార్లింగ్ – జక్కన్నల కలయికలో విజువల్ వండర్ ‘బాహుబలి : ది బిగినింగ్’, దాన్ని మించి ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ చిత్రాలు రావడం.. సంచలన విజయం సాధించడం.. అలా అప్పటి ఈ ముగ్గురి కోరిక తీరడం జరిగింది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus