ఒక సినిమా కోసం అనుకున్న టైటిల్ .. ఇంకో సినిమాకి పెట్టడం అనేది కొత్త విషయం కాదు. ‘అర్జున్’ అనే టైటిల్ అల్లు అర్జున్ కోసం నిర్మాత అల్లు అరవింద్ రిజిస్టర్ చేశారు. కానీ అది మహేష్ బాబు సినిమా యూనిట్ రిక్వెస్ట్ చేయడంతో.. అల్లు అరవింద్ అందుకు అంగీకరించారు. అలాగే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే టైటిల్ మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేశారు. కానీ అది ప్రభాస్ – దిల్ రాజు..ల సినిమా కోసం ఇవ్వడం జరిగింది.
‘మిర్చి’ టైటిల్ కూడా మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించినదే. కానీ అది ప్రభాస్ – కొరటాల సినిమా కోసం ఇవ్వడం జరిగింది. ‘దేవర’ అనే టైటిల్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించారు.. కానీ అది ఎన్టీఆర్ – కొరటాల సినిమా కోసం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది కొంచెం డిఫరెంట్.
విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా వచ్చింది. దీనికి ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నారు. అందులో ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ఒకటి. కానీ కథ ప్రకారం.. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడు కాదు.. అందుకే టీం ఆ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కోసం అనుకుంటున్నారట.
వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai) హీరోగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ఫేమ్ మున్నా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. అనిల్ సుంకర ఆ చిత్రానికి నిర్మాత. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని సమాచారం. అందుకే ‘దేవుడే దిగి వచ్చినా’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నారట. నాగార్జున ‘సంతోషం’ సినిమాలోని ఓ సూపర్ హిట్ పాటలో వచ్చే లైన్స్ ఆధారంగా ఈ టైటిల్ ని అనుకోవడం జరిగింది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!