బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) నుండి సినిమా వచ్చి 4 ఏళ్ళు కావస్తోంది. మధ్యలో హిందీ డెబ్యూ ఇచ్చాడు. ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో వినాయక్ (V. V. Vinayak) దర్శకత్వంలో రీమేక్ చేశాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. తెలుగులో అయితే 2021 లో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ (Alludu Adhurs) తర్వాత..అతని నుండి మరో సినిమా రాలేదు. కానీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. సాగర్ చంద్ర (Saagar K. Chandra) దర్శకత్వంలో చేస్తున్న ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) 80 శాతం కంప్లీట్ అయ్యింది.
‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో ‘భైరవం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా చిత్రీకరణ దశలో ఉంది. వీటితో పాటు ‘చావు కబురు చల్లగా’ (Chaavu Kaburu Challaga) అనే డిజాస్టర్ తీసిన దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటితో ఓ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు. అలాగే ‘మాన్సూన్ పిక్చర్స్’ బ్యానర్లో కూడా ఓ మైథలాజికల్ మూవీ చేస్తున్నాడు. లుథీర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఇలా బెల్లంకొండ కంప్లీట్ చేయాల్సిన 4 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి.
అయినప్పటికీ మరో కొత్త సినిమాకు సైన్ చేశాడని సమాచారం. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘పొలిమేర’ (Maa Oori Polimera) దర్శకుడు అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) చెప్పిన ఓ కథకి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2025 ఫిబ్రవరికి బెల్లంకొండ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
మరోపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) డేట్స్ కోసం ‘టైసన్ నాయుడు’ నిర్మాతలైన ’14 రీల్స్ ప్లస్’ వారు ఎదురు చూస్తున్నారు.అది చిత్రీకరణ దశలో ఉండగానే వరుసగా సినిమాలు ఒప్పేసుకుని వాటికి డేట్స్ ఇచ్చేస్తున్నాడు. మిగిలిన నిర్మాతలకు కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రవర్తన నచ్చడం లేదట. కానీ హీరోలని నిలదీయలేని పరిస్థితి నిర్మాతలది. ఏం చేస్తారు పాపం. అయితే 2025 లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుండి 2,3 వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.’