Bellamkonda Sreenivas: సూపర్ హిట్ రీమేక్ ని వదులుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ లేక అల్లాడుతున్నాడు. మరోపక్క వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు.కానీ దేనిని కూడా కంప్లీట్ చేయడం లేదు. ‘టైసన్ నాయుడు’ ‘హైందవం’ వంటి సినిమాలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ వీటి తర్వాత ప్రారంభమైన ‘భైరవం’ ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యింది.కానీ అది విజయం సాధించలేదు.

Bellamkonda Sreenivas

దీంతో దర్శకనిర్మాతలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. షూటింగ్ అనుకున్న టైంలో కంప్లీట్ అవ్వకపోతే నిర్మాతల పై వడ్డీల భారం పడుతుంది. మరోపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఓ టాక్ ఉంది.

ఇదిలా ఉండగా… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కిల్’ ను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. వీరి కాంబినేషన్లో ‘రాక్షసుడు’ అనే సినిమా వచ్చింది. అది డీసెంట్ సక్సెస్ అందుకుంది. దీంతో ‘కిల్’ కూడా వర్కౌట్ అవుతుంది అని అతను భావిస్తున్నట్టు టాక్ వినిపించింది. కానీ ‘కిల్’ సినిమా తెలుగులోకి కూడా డబ్ అయ్యింది.

ఓటీటీలో అందుబాటులో ఉంది. చాలా మంది ‘కిల్’ ను చూసేశారు. అలాంటప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే జనాలు ఎందుకు థియేటర్ కి వచ్చి చూస్తారు.? అందుకే బెల్లంకొండ ఈ రీమేక్ నుండి తప్పుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. విక్రమ్ కొడుకు ధృవ్ తో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించి రిలీజ్ చేయాలని టీం భావిస్తున్నట్టు సమాచారం.

తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus