ప్రముఖ నటుడు లైవ్ లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బెంగాలీ నటుడు సువో చక్రవర్తి చేతిలో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో నలిగి పోతుండడంతో ఫేస్ బుక్ లైవ్లోనే సూసైడ్ అటెంప్ట్ కు పాల్పడినట్టు సమాచారం. ‘మంగళ చాంది’ ‘మానస’ వంటి బెంగాలీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకాదరణ పొందిన చక్రవర్తి జూన్ 8న .. మంగళవారం నాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫేస్ బుక్ లో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వచ్చిన సువో చక్రవర్తి..
సడన్ గా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసి అందరికీ షాకిచ్చాడు. ఇది చూసిన ఆయన స్నేహితులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయడమే కాకుండా పోలీసులకు కూడా ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.దాంతో అతని ప్రాణాలు నిలబడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం వల్లనే అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో తేల్చారు.
కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అనేక పరిశ్రమలు ఆర్ధికంగా నష్టపోయాయి. అందులో సినిమా పరిశ్రమకి వందల కోట్ల నష్టం వాటిల్లింది. సినిమా పైనే ఆధారపడి బ్రతుకుతున్న ఎంతో మంది తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. సువో చక్రవర్తి కూడా ఆ కోవకి చెందిన వాడే..!
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!