Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » సినిమాల్లో మెప్పించిన డాడీ

సినిమాల్లో మెప్పించిన డాడీ

  • June 17, 2017 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల్లో మెప్పించిన డాడీ

తెలుగు చిత్రాల్లో కుటుంబసభ్యుల మధ్య ఉండే అనుబంధాన్ని మన దర్శకులు చాలా చక్కగా చూపించారు. అలాగే తండ్రి కొడుకులు, కూతుళ్ల మధ్య ప్రేమను కూడా మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. రేపు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి గొప్పదనాన్ని చాటే సినిమాలపై ఫోకస్..

1. డాడీ Daddyమెగాస్టార్ చిరంజీవి తండ్రి పాత్ర పోషించిన సినిమా డాడీ. బేబీ అనుష్క ఇందులో చిరు కూతురుగా నటించింది. కొడుకుగా, అన్నగా మెప్పించిన మెగాస్టార్ డాడీగా కంటతడి పెట్టించారు. బేబీ అనుష్క, చిరు మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.

2. నాన్నకు ప్రేమతో Nannaku Premathoమాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఎన్టీఆర్.. కమర్షియల్ హంగులకు దూరంగా చేసిన మూవీ నాన్నకు ప్రేమతో. ఇందులో తన తండ్రిని మోసం చేసిన వ్యక్తి ఆటకట్టించడానికి ఎన్టీఆర్ చేసే ప్రయత్నం బాగా ఆకట్టుకుంటుంది. అలాగే పిల్లలను పెంచడానికి రాజేంద్రప్రసాద్ ఎలా కష్టపడ్డాడో చెప్పే సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది.

3. అమృత Amruthaసొంత తండ్రి కాకపోయినా అంతకంటే ఎక్కువగా పెంచుకునే బిడ్డపై ప్రేమ చూపించడమే అమృత సినిమాలో అందరికీ నచ్చిన అంశం. ఇందులో తండ్రి గా మాధవన్, కూతురిగా కీర్తన అద్భుతంగా నటించి మెప్పించారు.

4. బొమ్మరిల్లు Bommarilluకొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని తాపత్రయ పడే తండ్రి, తండ్రి బాటలో కాకుండా సొంతదారిలో నడిచి తండ్రి అంత వాడిని కావాలని కోరుకునే కొడుకు.. వీరిద్దరి మధ్య వచ్చే సంఘర్షణలను భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో నేచురల్ గా చూపించారు. తండ్రిగా ప్రకాష్ రాజ్, కొడుకుగా సిద్ధార్ద్ జీవించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు.

5. సన్ అఫ్ సత్యమూర్తి Son of satyamurthyకొడుకు మంచి పనులు చేసి తండ్రికి మంచి పేరు తీసుకురానవసరం లేదు కానీ.. తండ్రికున్న మంచి పేరును చెడగొట్టకుండా ఉంటే చాలు. ఇదే అంశంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన మూవీ సన్ అఫ్ సత్యమూర్తి. తండ్రి ఇచ్చిన మాట వట్టి మాట కాకూడదని ప్రాణాలను సైతం లెక్క చేయని కొడుకు పాత్రలో అల్లు అర్జున్ నటన శెభాష్ అనిపించుకుంది.

6. సుస్వాగతం Suswagathamబిడ్డ ఒక వయసుకు ఎదిగిన తర్వాత తండ్రి స్నేహితుడిగా ఉండాలని చెబుతుంటారు. వాటిని కొంతమంది మాత్రమే పాటిస్తుంటారు. అలా ఉంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టిన సినిమా సుస్వాగతం. రఘువరన్, పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా కాకుండా మంచి మిత్రుల్లా నటించి అభినందనలు అందుకున్నారు.

7. కొత్త బంగారులోకం Kottha Bangarulokamమనం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మన మధ్య ఉండే ఫీలింగ్స్ లో మార్పు ఉండదు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఇంకా బలపడుతుంది. నేటి తండ్రి కొడుకులుగా ప్రకాష్ రాజ్, వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం సినిమాలో నటించి ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.

8. సూర్య S/O కృష్ణన్ Surya S/O Krishnanప్రతి కొడుక్కి తండ్రే రియల్ హీరో. ప్రతి విషయంలోనూ నాన్నని స్ఫూర్తిగా తీసుకునే కోడలు చాలామంది ఉన్నారు. అటువంటి తండ్రికొడుకులమధ్య ఉండే అనుబంధాన్ని సూర్య S/O కృష్ణన్ లో చూపించారు. తండ్రి కొడుకుల పాత్రలో సూర్య నటించి అందరి ప్రసంశలు అందుకున్నారు.

9. ఆకాశమంత Aakashamanthaఒకనికొక ఊరిలో ఒకే ఒక అయ్యా.. ఒకే ఒక అయ్యకి తోడు ఒకే ఒక అమ్మ.. ఆకాశమంత సినిమా కథని మొత్తం ఈ ఒక్క లైన్లో చెప్పేసారు. కూతురు మంచి ఇంటికి కోడలుగా వెళ్లాలని తపన పడే నాన్న గా ప్రకాష్ రాజ్ మరో మారు అద్భుతంగా నటించారు. తండ్రిని అమితంగా ప్రేమించే కూతురిగా త్రిష అందరి మనసులని దోచుకుంది.

10. నాన్న Nannaవయసు పెరిగినా బుద్ధి ఎదగని తండ్రి, అతనికి తెలివైన కూతురు. తాను లేకపోతే తండ్రి ఏమైపోతాడనే బాధపడే అమ్మాయి.. తాను దూరమైతేనే పాపాయి భవిష్య్తతు బాగుంటుందనే తండ్రి.. మొదలు నుంచి చివరి వరకు పూర్తిగా తండ్రి కూతుళ్ళ ప్రేమతో నిండిన సినిమా నాన్న. విలక్షణ నటుడు విక్రమ్ తండ్రిగా, కూతురిగా సారా తమ నటనతో అందరినీ కంటతడి పెట్టించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakashamantha Movie
  • #Amrutha Movie
  • #Bommarillu movie
  • #Daddy Movie
  • #kotha bangaru lokam Movie

Also Read

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

related news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

trending news

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

13 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

14 hours ago
Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

16 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

20 hours ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

20 hours ago

latest news

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

14 hours ago
Tollywood: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడికి బిగ్ రిలీఫ్..

Tollywood: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడికి బిగ్ రిలీఫ్..

15 hours ago
Raja Saab: సంక్రాంతి సెంటిమెంట్ షాక్.. పండగ మొదటి సినిమాకు కలిసి రావడం లేదా?

Raja Saab: సంక్రాంతి సెంటిమెంట్ షాక్.. పండగ మొదటి సినిమాకు కలిసి రావడం లేదా?

15 hours ago
Geetu Mohandas: ఓ లేడీ డైరక్టర్‌ నుండి ఇలాంటి సీన్‌.. అసలెవరీ గీతూ మోహన్‌దాస్‌?

Geetu Mohandas: ఓ లేడీ డైరక్టర్‌ నుండి ఇలాంటి సీన్‌.. అసలెవరీ గీతూ మోహన్‌దాస్‌?

19 hours ago
The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version