Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » ఎంత సక్కగా రాశావోయ్ బోసు.. ఎంతటి అర్ధాన్ని వివరించావోయ్ బాసూ

ఎంత సక్కగా రాశావోయ్ బోసు.. ఎంతటి అర్ధాన్ని వివరించావోయ్ బాసూ

  • April 9, 2018 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎంత సక్కగా రాశావోయ్ బోసు.. ఎంతటి అర్ధాన్ని వివరించావోయ్ బాసూ

కొన్ని పాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే కళ్ళు చమర్చుతాయి, హృదయం ధ్రవిస్తుంది, మనసు బరువెక్కుతుంది. ఇంకొన్ని పాటలు వింటున్నప్పుడు ఆనందపరవశంతో మనసు ఉప్పొంగుతుంది, ఇంకొన్నిసార్లు ఆలోచనలో పాడేస్తుంది. అయితే.. అది కేవలం సంగీత దర్శకుడి ప్రతిభ అనే అనుకోని క్రెడిట్ మొత్తం అతని ఖాతాలోనే వేసేస్తుంటాం. కానీ దానివెనుక ఒక రచయిత కలం కష్టం కూడా ఉంది. ఇండస్ట్రీలో రచయితల గొప్పదనాన్ని శ్రీశ్రీ, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటివారు ఎంతో ఘనంగా చాటి చెప్పారు. వారి ఖాతాలో చేరదగ్గ మరో రచయిత చంద్రబోస్. ఆయన కలం నుంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు చూసి, విని ఆనందించండి..!!

అందానికే అందానివా (మురారి)Murariమహేష్ బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మురారి”. ఈ చిత్రంలో సోనాలీ బింద్రే తాను ప్రేమించి మానసిచ్చిన మహేష్ బాబుని ఊహించుకొంటూ తాను పడే విరహవేదనను మహేష్ పాయిటాఫ్ వ్యూలో వర్ణించిన విధానం భలే హుందాగా ఉంటుంది. “నువ్వు పిలిచేందుకే.. నాకు పేరున్నది, నిన్ను పిలిచేందుకే.. నాకు పిలుపున్నది” అనే చరణంలో ఒక ప్రేమికుడు తన ప్రేయసిని ఎంతలా “తన” అనుకుంటున్నాడో వివరించిన విధానం విశేషంగా ఆకట్టుకుంటుంది.

అమ్మాయే సన్నగా.. (ఖుషి) Kushiపవన్ కళ్యాణ్-భూమికల బ్లాక్ బస్టర్ చిత్రమైన “ఖుషి”లో కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా వచ్చే ఈ పాట చాలా హుందాగా ఉండడంతోపాటు ఇండైరెక్ట్ ప్రపోజల్ లా ఉంటుంది. అబ్బాయి, అబ్బాయి ఇద్దరూ ప్రేమలో పడితే కష్టంలో కూడా సుఖాన్ని, నెగిటివ్ లో పాజిటివ్ ని ఎలా చూస్తారు అనేది పామరుడికి సైతం అర్ధమయ్యే భాషలో వివరించారు చంద్రబోస్. “ప్రేమలు పుట్టేవేళ పగలంతా రేయేలే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే, ప్రేమే తోడుంటే పామైనా తాడేలే, ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే” ఈ ఒక్క చరణం చాలు ప్రేమలో పడిన యువత ఎలా ఫీల్ అవుతారు అనేది.

ఎక్కడో పుట్టి (స్టూడెంట్ నెం.1) Student No 1ఇప్పుడంటే ర్యాప్, ఫోక్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు కానీ.. ఒక ఏడెనిమిదేళ్ళ క్రితం ఫేర్ వెల్ పార్టీ అనగానే కాలేజ్ అయినా స్కూల్ అయినా అందిరికీ ఆటోమేటిక్ గా గుర్తొచ్చే పాట “స్టూడెంట్ నెం.1″లోని “ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి”. ఈ పాటలో కాలేజ్ డేస్ లో స్టూడెంట్స్ చేసే అల్లరిని, ఆ చిలిపిదనాన్ని భరిస్తూనే విద్యార్ధులను తీర్చిదిద్దే టీచర్ల గొప్పదనాన్ని అత్యద్భుతంగా వివరించారు చంద్రబోస్. పాట చివర్లో “మనకు మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేం కూడా ఇంతేనండి” అంటూ ఎండ్ చేసిన విధానం స్టూడెంట్-లెక్చరర్ బంధాన్ని బహు బాగా వివరించింది.

నీ నవ్వుల తెల్లదనాన్ని (ఆది)Aadhi ఒక ప్రేమికుడు తన ప్రేయసి అందాల్ని ప్రకృతితో పోల్చి చెబుతూ అత్యద్భుతంగా వర్ణిస్తాడు. “నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది.. ఇవ్వొద్దు ఇవ్వొద్దు” అంటూ తన ప్రేయసిని ప్రేమికుడు వేడుకొనే భాష్యంలో ఆమె అందాన్ని వర్ణించిన విధానం ఊహించడానికి కూడా ఎంత అద్భుతంగా ఉంది. ఈ సాంగ్ లో ఎన్టీయార్-కీర్తిల హావభావాలు కూడా చూడముచ్చటగా ఉంటాయి.

ఫీల్ మై లవ్ (ఆర్య) Aaryaఅమ్మాయి తన ప్రేమను ఒప్పుకోకపోతుంటేనే యాసిడ్ తో దాడులు చేసేస్తున్న తరుణంలో.. ఓ వన్ సైడ్ లవర్ “నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, జస్ట్ నా ప్రేమను ఫీల్ అవ్వు” అని తన ప్రేమను చాటుకొనే భావానికి అప్పటి ప్రేమికులందరూ ఫిదా అయిపోయారు. “నా ఉనికే నచ్చదంటూ.. నా ఉహే రాదని, నేనంటే కిట్టదంటూ.. నా మాటే చేదని, నా చెంతే చేరనంటూ.. అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్” అనే చరణంలో తన బాధతోపాటు ప్రేమను కూడా వ్యక్తపరిచే విధానం విన్న తర్వాత చంద్రబోస్ కవితాత్మకతకు జోహార్లు చెప్పకుండా ఉండలేమ్. ఇక సుకుమార్ ఈ పాటను తెరకెక్కించిన విధానం పాటలోని భావాన్ని మరింత అందంగా, అర్ధవంతంగా వివరించింది.

పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ (నాని) Nani“మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వారమిచ్చే తీపి శాపం అమ్మ”. ఈ ఒక్క చరణం “అమ్మ” గొప్పదనాన్ని వివరించడానికి. “నాని” సినిమా అయితే ఫ్లాప్ అయ్యింది కానీ.. ఈ పాట మాత్రం ఎవర్ గ్రీన్.

మౌనంగానే ఎదగమని (నా ఆటోగ్రాఫ్)Naa Autographజీవిత సత్యం, గమనం, ధ్యేయం ఈ ఒక్క పాటలో తెలుస్తుంది. “మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది” అనే పల్లవిలో భావం ఎన్నో పుస్తకాలు చదివితే తప్ప అర్ధం కాదు. అంతటి మహత్తర భావాన్ని ఒకే ఒక్క పల్లవిలో కోట్ల మందికి అర్ధమయ్యేలా చేసిన ఘనత చందబోస్ ది.

ఏమంటారో.. (గుడుంబా శంకర్) Gudumba Shankarఅప్పటివరకూ యుగళ గీతాలు (డ్యుయేట్స్) ఉన్న పంధాను మార్చిన పాట ఇది. ఇద్దరు ప్రేమికుల మనసులోని మాటలను ఎంతో సున్నితంగా వివరించిన విధానం అద్భుతం. “ఎదురుగా వెలుగుతున్నా నీడని, బెదురుగా కలుగుతున్న హాయిని, అణువునా తొణుకుతున్న చురుకుని, మనసున మురుసుకున్న చెమటని.. ఏమంటారో?” అనే చరణంలో ప్రేమికుల ఇష్టకష్టాలను, కోపతాపాలను వర్ణించిన విధానం మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది.

గుండు సూదీ (ఛత్రపతి) Chatrapathiఒక అమ్మాయి తన మనసులోని ప్రేమను తాను కోరుకొన్న కుర్రాడికి చెప్పే తీరు ఎంత ముద్దుగా ఉంటుందో. ప్రభాస్-శ్రియాల నడుమ ఆ ప్రేమను చిత్రీకరించిన విధానం కూడా అంతే ముద్దుగా ఉంటుంది. “గుండు సూదీ గుండు సూదీ గుచ్చుకుంది గుండు సూదీ. గుంజిందయ్యో గుండె నాది” అనే పల్లవిలోనే అమ్మడు ప్రేమలో పడిందని, మనసులో ప్రేమ వల్ల అల్లకల్లోలం అనుభవిస్తుందనే భావం కొట్టొచ్చినట్లు వినపడేలా రాశారు చంద్రబోస్”.

బేబీ హి లవ్స్ యూ (ఆర్య 2) Arya 2అసలు తన ప్రేమను వ్యక్తపరచడానికే కుర్రాళ్ళు నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ.. “ఆర్య 2″లో తన స్నేహితుడు నవదీప్ కాజల్ ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తాను కూడా ప్రేమిస్తున్న కాజల్ కి అల్లు అర్జున్ వివరించే విధానం చూడముచ్చటగా మాత్రమే కాదు వినసోంపుగానూ ఉంటుంది. “అల్లారెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత, జల్లుపడ్డ వేల పొంగి పోంగి పూసే మట్టిపూల విలువంత, బిక్కు బిక్కు మంటూ పరీక్ష రాసే పిల్లగాడి బెదురంతా, లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత” అనే చరణంలో ప్రేమ ఎంత సహజమైనదో, స్వచ్ఛమైనదో వర్ణించిన విధానం చంద్రబోస్ “కలా”త్మకతను ఘనంగా చాటి చెప్పింది.

ఇన్ ఫేక్చుయేషన్ (100% లవ్) 100% Loveవినడానికి ఏదో మ్యాథ్స్ & సైన్స్ క్లాస్ లా అనిపిస్తుంది కానీ.. ఈ పాటలో ప్రేమలో పడబోయేవారి భావాలను, ఎమోషన్స్ ను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అర్ధమయ్యే రీతిలో రాసిన విధానం అద్భుతం. “దూరాలకి మీటర్లంట, భారాలకీ కేజీలంట, కోరికలకీ కొలమానం ఈ జంట, సెంటిగ్రేడు సరిపోదంట, ఫారిన్ హీటు పని చేయదంట, వయసు వేడి కొలవాలంటే తంటా” అనే చరణంలో యువ జంట ప్రేమ భావాల్ని వివరించిన విధానం, అద్నాన్ సమీ ఆ పాటను పాడిన విధానం ఈ పాటను శ్రోతల మనసుల్లో, చెవుల్లో మోటామోగేలా చేసింది.

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే (మనం) Manam“ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహమూ.. ప్రేమ రెండు నావే, వెలుగుతో వచ్చానే నీడలా మారానే.. వెలుగునీడల్లో తోడు నీవే”. ఒక మగాడు తనకు కాబోయే సతీమణితో ఇంతకుమించి ఏం చెప్పగలడు, ఇంతకంటే అద్భుతంగా ఏమని ప్రపోజ్ చేయగలడు. చంద్రబోస్ ఈ పాట రాసేప్పుడు ఎవర్ని ఊహించొని ఉంటారో తెలియదు కానీ.. పాట వినేవారు మాత్రం తమ అర్ధాంగినో లేక ప్రేయసినో ఊహించుకోవడం ఖాయం.

నెక్స్ట్ ఏంటీ (నేను లోకల్) Nenu Localటెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన ప్రతి ఒక్కడు.. ఎంత కష్టపడి పాసయ్యాను అని సంతోషించేలోపు “నెక్స్ట్ ఏంటీ” అంటూ తల్లిదండ్రులు మొదలుకొని స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగువారూ తెగ ఇబ్బందిపెట్టి కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. వారి కన్ఫ్యూజన్ తో కూడిన బాధని చంద్రబోస్ ప్రెజంట్ ట్రెండ్ కి తగ్గట్లు ట్రెండీ లిరిక్స్ సమకూర్చడం విశేషం. “బల్బుని చేసే టైమ్ లో ఎడిసన్ గారిని కలిసేసి, నెక్స్ట్ ఏంటంటే పారిపోడా బల్బుని వదిలేసి” అనే చరణంతో “నెక్స్ట్ ఏంటీ” అనే ప్రశ్న తీవ్రతని ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విధంగా రాశారాయన.

చూసా చూసా (ధృవ) Dhruvaప్రేమించిన అబ్బాయికి ప్రేమను తలపడం కోసం పరితపించే ఒకమ్మాయి. అతడికి తన ప్రేమను చెప్పుకోలేదు కానీ.. ఆ ప్రేమను మనసులో దాచుకొని పొందే ఆనందాన్ని మాత్రం ఓ యుగళ గీతంగా పాడుకుంటే వచ్చే భావమే “చూశా చూశా చూశా”. “నా మాటలన్నీ నీ పేరుతోనే నిండాలి తియ్యగా.. నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలి హాయిగా” అనే ఒక్క చరణంలోనే అమ్మాయి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో వివరించిన బోస్ కాలానికి సలాం చెప్పాల్సిందే.

ఎంత సక్కగున్నావే (రంగస్థలం) Rangasthalamతొలిచూపులో ప్రేమించిన అమ్మాయి అందాన్ని, ఆమె చిలిపిదనాన్ని, హుషారుని, గొప్పదనాన్ని ఒక పల్లెటూరి ప్రేమికుడు పాడుకుంటే ఎంత అందంగా ఉంటుందో ‘ఎంత సక్కగున్నావే” పాట అంత సక్కగా ఉంటుంది. ముఖ్యంగా పాట ఆఖర్లో వచ్చే “తిరణాళ్లలో తప్పి ఎడిసేటి బిడ్డకు ఎదురోచ్చినా తల్లి సిరునవ్వులాగా ఎంతసక్కగున్నావే” అనే మాట ఎంత స్వచ్ఛంగా ఉంది. ప్రేమికుడి ఇష్టాన్ని బిడ్డకు తల్లిపై ఉంటే స్వచ్చమైన, కల్మషం లేని ప్రేమతో పోల్చిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే ప్రెజంట్ జనరేషన్ రైటర్స్ లో చందబోస్ ది బెస్ట్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #100% Love Songs
  • #Aadhi Songs
  • #Aarya Songs
  • #Arya 2 Songs
  • #Best Lyrics From Chandrabose

Also Read

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

related news

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

trending news

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

14 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 day ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

1 day ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

1 day ago

latest news

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

8 hours ago
Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

14 hours ago
Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

14 hours ago
Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

14 hours ago
Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version