2021లో సపోర్టింగ్ రోల్స్ లో సత్తా చాటిన స్టార్లు!

ఈ మధ్యకాలంలో హీరో, హీరోయిన్ల విషయంలోనే కాకుండా.. సైడ్ క్యారెక్టర్లపై కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మన దర్శకనిర్మాతలు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నటులను దిగుమతి చేసుకుంటున్నారు. 2021లో తెలుగు సినిమాల్లో కొందరు తమ సపోర్టింగ్ రోల్స్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ను కనబరిచారు. ఈ పాత్రల్లో వారిని తప్ప వేరొకరిని ఊహించలేని విధంగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

1) వరలక్ష్మీ శరత్ కుమార్ – కోలీవుడ్ కి చెందిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయింది. ‘క్రాక్’ సినిమాలో జయమ్మగా ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలానే ‘నాంది’ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ రెండు సినిమాలతో వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు సమంత ‘యశోద’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

2) ప్రకాష్ రాజ్ – పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నందా క్యారెక్టర్ లో కనిపించారు ప్రకాష్ రాజ్. కోర్టు రూమ్ లో పవన్ కి, ప్రకాష్ రాజ్ కి మధ్య జరిగే మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రకాష్ రాజ్ తప్ప ఆ సన్నివేశాల్లో పవన్ కి ధీటుగా నిలబడేవారెవ్వరూ ఉండరు. ఫస్ట్ నుంచి పవన్ – ప్రకాష్ రాజ్ కాంబినేషన్ అలాంటిది మరి.

3) కాజల్ – అప్పటివరకు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన కాజల్ ‘మోసగాళ్లు’ సినిమాలో హీరో సిస్టర్ రోల్ లో కనిపించింది. సైడ్ క్యారెక్టర్ అని లైట్ తీసుకోకుండా.. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

4) రాహుల్ రామకృష్ణ – నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’ సినిమాలో రాహుల్ పాత్ర ఓ రేంజ్ లో ఆడియన్స్ ను నవ్వించింది. అతడి డైలాగ్స్, నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

5) రాజీవ్ కనకాల – ఈ ఏడాది విడుదలైన ‘నారప్ప’, ‘లవ్ స్టోరీ’ సినిమాల్లో రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు రాజీవ్ కనకాల. ‘నారప్ప’లో ప్రియమణి అన్నయ్యగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కనబరిస్తే.. ‘లవ్ స్టోరీ’లో విలన్ రోల్ లో మెప్పించాడు రాజీవ్ కనకాల.

6) రమ్యకృష్ణ – మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమాలో అవినీతి పరురాలైన రాజకీయనాయకురాలిగా కనిపించింది రమ్యకృష్ణ. విశాఖ వాణి పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. తన పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో వెండితెరను షేక్ చేసింది.

7) జగపతి బాబు – బోయపాటి తన సినిమాల్లో జగపతిబాబుని ఓ రేంజ్ లో చూపిస్తుంటారు. ‘అఖండ’ సినిమాలో జగ్గూభాయ్ ని స్వామిజీ గెటప్ లో చూపించారు. ఆయన తెరపై కనిపించేది కాసేపే అయినా.. తన పెర్ఫార్మన్స్ తో మెప్పించారు.

8) జగదీశ్ బండారి – ఈ ఏడాది విడుదలైన ‘పుష్ప’ సినిమాలో బన్నీకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించాడు జగదీశ్. సినిమాలో హీరో కనిపించే ప్రతీ ఫ్రేమ్ లో ఇతడు కూడా కనిపిస్తాడు. బన్నీతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడుతూ.. తనకొచ్చిన ఆఫర్ కి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు.

Share.