ఓవర్సీస్ లోను భారీ వసూళ్లు సాధిస్తున్న అనుష్క భాగమతి

స్వీటీ అనుష్క బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో భాగమతి చేరిపోయింది. బాహుబలి తర్వాత అనుష్క చేసిన ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం నాడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ భారీ కలక్షన్స్ వసూలు చేస్తోంది. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో ఓవర్ సీస్ లోను మంచి క్రేజ్ ఉంది. యూఎస్ లోని 120 లొకేషన్లలో ప్రీమియర్ షోలు, శుక్రవారం ఓపెనింగ్స్ కలుపుకొని 2.79 లక్షల డాలర్లను రాబట్టిన ఈ చిత్రం శనివారం 2.63 లక్షల డాలర్లను అందుకుని మొత్తంగా 5.52 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది.

కేవలం రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ దాటిపోయింది. ఈ మూవీ ఆదివారం 1 .6 లక్షల డాలర్లు వసూలు చేసింది. దీంతో మొత్తం 7 లక్షల డాలర్లను వసూలు చేయగలిగింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో భాగమతి వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోతుందని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. గతంలో అనుష్క నటించిన రుద్రమదేవి వన్ మిలియన్ క్లబ్ మార్క్ ని చేరుకోలేకపోయింది. ఆ సినిమా ద్వారా మిస్సయిన రికార్డుని.. భాగమతి సినిమాతో అనుష్క సాధించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus