నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల నటించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.
అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఓపెనింగ్స్ సో సో గా వచ్చాయి. కానీ తర్వాత బాగానే పికప్ అయ్యి బ్రేక్ ఈవెన్ సాధించింది.ఇప్పటికీ స్టడీగా రాణిస్తుంది. మూడో వీకెండ్ ను కూడా ఈ మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
18.71 cr
సీడెడ్
12.50 cr
ఉత్తరాంధ్ర
6.15 cr
ఈస్ట్
3.46 cr
వెస్ట్
2.85 cr
గుంటూరు
5.35 cr
కృష్ణా
2.60 cr
నెల్లూరు
2.64 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
54.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
5.51 cr
ఓవర్సీస్
7.03 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
66.80 cr (షేర్)
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 15 రోజులు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.66.8(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.5.8 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.