Bhagavanth Kesari Trailer: బ్లాక్ బస్టర్ ఫీల్ ను కలిగిస్తున్న ‘భగవంత్ కేసరి’ ట్రైలర్!

నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీ మూవీ ‘భగవంత్ కేసరి’.ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాహు గరపాటి, హరీష్ పెద్ది లు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కాత్యాయని గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది. విలన్ గా నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రామ్పాల్ నటిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ట్రైలర్‌ను ఈరోజు రాత్రి 8:16 గంటలకు విడుదల చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు.

వారు చెప్పినట్టు గానే కొద్దిసేపటి క్రితం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను 2 నిమిషాల 51 సెకన్ల నిడివి కలిగి ఉంది. తన కూతురిని ఆర్మీకి పంపాలి అనే ఆశయం కలిగిన తండ్రిగా బాలకృష్ణ, ఆర్మీకి వెళ్లడం ఇష్టం లేని కూతురిగా శ్రీలీల కనిపిస్తుంది. తర్వాత యాక్షన్ సన్నివేశాలు వరుసగా వచ్చాయి. అసలు విలన్ కి బాలకృష్ణ, శ్రీలీలకి సంబందం ఏంటి అనే సస్పెన్స్ మెయిన్టైన్ చేస్తూ ట్రైలర్ సాగింది.

తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బాలయ్య అభిమానులకు నచ్చే విధంగా ట్రైలర్ ను కట్ చేశాడు అనిల్ రావిపూడి. బాలయ్య అభిమానుల పల్స్ అతను పట్టినట్టే కనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి:

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus