దసరా కానుకగా రెండు పెద్ద స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ కాబోతుంది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’, రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు రెండు స్ట్రైట్ తెలుగు పెద్ద సినిమాలు కాగా.. విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘లియో’ డబ్బింగ్ సినిమా కావడం గమనార్హం. అక్టోబర్ 19 న ‘భగవంత్ కేసరి’ ‘లియో’ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.
అంటే మరికొన్ని గంటల్లో అనమాట. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ ప్రమోషనల్ కంటెంట్ బాగుంది. సినిమాపై కూడా మంచి హైప్ ఏర్పడింది. రవితేజ సినిమా ఓ రోజు లేట్ గా రానుండడంతో తొలి రోజు ‘భగవంత్ కేసరి’ కి ఎక్కువ స్క్రీన్స్ దక్కాయి. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం విజయ్ నటించిన ‘లియో’ కంటే కూడా వెనుక ప్లేస్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ‘లియో’ అడ్వాన్స్ బుకింగ్స్ ను కనుక గమనిస్తే రూ.7.3 కోట్లుగా ఉండగా..
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం కేవలం రూ.5.4 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. బాలయ్య సినిమాలకి ఎక్కువ స్క్రీన్స్ దక్కిన మాట నిజం. అయితే విజయ్ చిత్రానికి మాత్రం టికెట్ హైక్స్ లభించాయి. ఎలా చూసుకున్నా ఓ డబ్బింగ్ సినిమా పై తెలుగు ప్రేక్షకులకి ఉన్న క్రేజ్.. ఇక్కడి పెద్ద సినిమా పై లేకపోవడం షాకిచ్చే అంశం.