‘రాధే శ్యామ్’ బ్యూటీ కూతురి సినిమాకి రిలీజ్ కష్టాలు..!

ఒకప్పటి హీరోయిన్ల కూతుర్లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పెద్ద సినిమాల్లో నటించినా ఎందుకో ఈమెకు కలిసిరాలేదు. తొందరగానే ఫేడౌట్ అయిపోయింది. మంజుల కూతుర్లు వనిత, ప్రీతి, శ్రీదేవి వంటి వారు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు కూడా అంతే..! ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంది. రేపో మాపో మాలాశ్రీ కూతురు కూడా డెబ్యూ ఇవ్వడానికి రెడీ అవుతుంది.

ఇక డెబ్యూ ఇవ్వడానికి దాదాపు రెడీ అయిపోయి.. వెనక్కి తగ్గింది భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని . ఈమె తెలుగులో ‘నేను స్టూడెంట్ సర్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ‘నాంది’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సతీష్ నిర్మించారు. ఈ మూవీ కథంతా హీరో ఫోన్ చుట్టూ తిరుగుతుంది.

యూత్ ను మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ ను టార్గెట్ చేసి తీసిన మూవీ ఇది. మార్చి 10న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పరీక్షల సీజన్ కావడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తనకు మంచి డెబ్యూ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది అవంతిక. అయితే ఆమె ఆశలకు బ్రేకులు పడినట్టు అయ్యింది. కంటెంట్ బాగుంటే రిలీజ్ లేటైనా ఫలితం బాగానే రావచ్చేమో

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus