Bhagyashree: ఆసుపత్రిలో భాగ్యశ్రీ.. హాట్ టాపిక్ గా మారిన ఆమె లేటెస్ట్ ఫోటో!

బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘యువరత్న రాణా’ చిత్రంలో చెల్లెలి పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా కాలం ఈమె తెలుగు సినిమాలో నటించలేదు. అయితే ఈ ఏడాది వచ్చిన ‘రాధే శ్యామ్’ మూవీలో ప్రభాస్ తల్లిగా నటించింది. ఈ సినిమాలో ఓ పక్క అమ్మ ప్రేమను చూపిస్తూనే మరోపక్క క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టపడే గృహిణిగా కనిపించింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె భర్త హిమాయ్ దాసాని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఇతనికి సర్జరీ కూడా జరిగింది. తన భర్త కుడి భుజానికి వైద్యులు శస్త్రచికిత్స చేశారని భాగ్య శ్రీ సోషల్ మీడియాలో తెలియజేసింది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. “భుజంలోని రొటేటర్ కఫ్ సాయంతోనే చేతిని 360 డిగ్రీల కోణంలో తిప్పగలం. రొటేటర్ కఫ్ సరిగా లేదంటే కండరాలకు రక్త ప్రసరణ ఆగిపోయి చేయి కదలిక కోల్పోతుంది.

వైద్యులు నా భర్త భుజంలోని రొటేటర్ కు శస్త్రచికిత్స చేశారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు వారు ఈ సర్జరీ చేయడం జరిగింది.ఇప్పుడు ఆయన కోలుకుంటున్నాడు. తిరిగి నవ్వుతున్నాడు’ అంటూ తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది భాగ్య శ్రీ. గతంలో వచ్చిన సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె అటు తర్వాత హిమాయ్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు అభిమన్యు అనే కొడుకు, అవంతిక అనే కూతురు ఉన్నారు. వీరిది హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. ‘రాధే శ్యామ్’ తో పాటు ఇంకా తెలుగు సినిమాలు చేయాలని ఆశ పడుతోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus