హిట్ కొట్టింది… మాలీవుడ్ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?
- September 7, 2026 / 02:15 PM ISTByFilmy Focus Desk
హిట్ హీరోయిన్.. నార్మల్ హీరోయిన్.. మధ్య తేడా మీకు ఇప్పుడు తెలియాలి అనుకుంటున్నారా.. అయితే యువ కథానాయిక భాగ్యశ్రీ భోర్సేని చూడండి మీకు అర్థమైపోతుంది. నిన్న మొన్నటివరకు ఆమె కొత్త సినిమా మొదలవుతోంది అంటే.. ‘మరో సినిమా అంతేగా’ అనే మాట అనేవారు. కానీ ఇప్పుడు ఆమె నుండి ఓ సినిమా వస్తోంది అంటే.. ‘ఇంకో సినిమానా.. ఏంటది?’ అనే ఎదురు ప్రశ్న వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు హిట్ హీరోయిన్ కాబట్టి.
Bhagyashri Borse
ఇక అసలు విషయం చూస్తే.. భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు మలయాళంలో అడుగుపెట్టింది. ప్రముఖ కథానాయకుడు మోహన్ లాల్ సినిమాలో కీలక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. ఈ మేరకు సినిమాను అనౌన్స్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, ‘మెప్పాడియన్’ సినిమా దర్శకుడు విష్ణు మోహన్ ఈ పాన్ ఇండియా సినిమాకు ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్ పెట్టారు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది.

‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌కు ఏ నేషన్స్ ప్రామిస్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2022లో రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు, బాంబుల వర్షం మధ్య ఉక్రెయిన్ సరిహద్దుల్లో వేలాదిమంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వాళ్లను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి భారత్ చేపట్టిన మిషనే ‘ఆపరేషన్ గంగా’ అనే పేరు పెట్టడం గమనార్హం.
‘కాంత’, ‘సెయాన్’ సినిమాలకు భాగ్యశ్రీని ఎంపిక చేసినప్పుడు తెలుగులో ఇక సినిమాలు చేయదా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘లెనిన్’ సినిమా విజయం తర్వాత ‘ఆపరేషన్ గంగా’ సినిమా అనౌన్స్ అయిన నేపథ్యంలో తెలుగులో కూడా చేస్తుంది కదా అని అంటున్నారు. తమిళం (‘కాంత’) లో సరైన విజయం అందుకోని భాగ్య.. మలయాళంలో అయినా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.











