Bhanu Chander: ఆ తప్పు వల్లే భానుచందర్ కు ఆఫర్లు తగ్గాయా?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన భానుచందర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో విలన్ రోల్స్ లో నటించడం తన దృష్టిలో తప్పు కాదని ఆయన అన్నారు. విలన్ గా మెప్పించడం సులువు కాదని అది డిఫికల్ట్ ఎమోషనల్ అని భానుచందర్ కామెంట్లు చేశారు. నా పిల్లలు నాకు బెస్ట్ క్రిటిక్స్ అని ఆయన చెప్పుకొచ్చారు. నేను నటించిన కొన్ని సినిమాలను చూస్తుంటే జెర్రి పాకినట్టు ఉంటుందని భానుచందర్ కామెంట్లు చేశారు.

తాను నటించిన కొన్ని పాత్రల గురించి స్పందిస్తూ డబ్బు కోసం గడ్డి తినక తప్పదు కదా అని భానుచందర్ పేర్కొన్నారు. ఎప్పుడు సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాలని అలా అని నేను చేసిన సినిమాలు చెడ్డ సినిమాలు అని చెప్పనని భానుచందర్ అన్నారు. నిరీక్షణ సినిమాను ఇప్పుడు చూసినా కొత్త సినిమాను చూశామనే భావన కలుగుతుందని భానుచందర్ వెల్లడించారు. ఆర్టిస్ట్ గా నిరీక్షణ నన్ను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచిందని భానుచందర్ పేర్కొన్నారు.

నిరీక్షణ, తరంగిణి, ముక్కుపుడక, సూత్రధారులు, అశ్విని సినిమాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయని ఆయన పేర్కొన్నారు. శోభన, సుహాసిని, అర్చన ముగ్గురూ బెస్ట్ యాక్టర్లేనని భానుచందర్ అన్నారు. వాళ్లు చాలా టాలెంటెడ్ అని భానుచందర్ కామెంట్లు చేశారు. అందరూ నా గురించి పాజిటివ్ గా చెప్పడం నా లక్ అని ఆయన అన్నారు. తెలుగులో చాలా పాత్రలు చేయకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు.

సూత్రధారులు సినిమాలో నేను పోషించిన ఏఎన్నార్ కొడుకు రోల్ మంచి రోల్ అని భానుచందర్ పేర్కొన్నారు. సుక్కల్లే తోచావే పాట, జాబిల్లి కోసం పాటలు అంటే నాకు చాలా ఇష్టమని భానుచందర్ అన్నారు. భానుచందర్ నటించిన పలు సినిమాల షూటింగ్ లు పూర్తైనా ఈ సినిమాలు ఇప్పటికీ రిలీజ్ కాలేదు. భానుచందర్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో చెడు వ్యసనాలకు బానిస కావడం భానుచందర్ కెరీర్ పై ప్రభావం చూపింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus