ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటన… కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ.. కైరా అద్వానీ అందం.. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు.. నేపథ్య సంగీతం.. ఇలా అన్ని కుదరడంతో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 37 కోట్ల షేర్ వసూలు చేసి మహేష్ బాబు సత్తాని చాటింది. తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో 10 కోట్ల పైనే షేర్ సాధించింది. అంతేకాదు తమిళనాడు లోను భరత్ అనే నేను భారీ కలక్షన్స్ అందుకోవడం విశేషం.
రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం మూవీ చెన్నైలో తొలిరోజు ఈ సినిమా 25 లక్షలు రాబట్టి మొదటి స్థానం(నాన్ బాహుబలి)లో నిలవగా ఇప్పుడు ఆ రికార్డును మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ బద్దలు కొట్టింది. మొదటిరోజు ఈ చిత్రం 27 లక్షలకు పైగానే రాబట్టి అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ వీకెండ్స్ లో ఎక్కువ కలక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. అత్యంత వేగంగా వందకోట్ల క్లబ్ లోను చేరనుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.