మహేష్ ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్ కి అంతరాయం
- August 19, 2017 / 08:11 AM ISTByFilmy Focus
కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ మూవీ ఒక పాట మినహా అంతా కంప్లీట్ అయింది. ఆ పాటను ఈనెల 23 నుంచి యూరప్ లో షూట్ చేయనున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న థియేటర్ లోకి రానుంది. ఈ సినిమాతో పాటు నెక్స్ట్ చిత్రం షూటింగ్ ని మహేష్ నడిపిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేస్తున్న “భరత్ అనే నేను” మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. నగర శివార్లలో వేసిన అసెంబ్లీ సెట్ లో కొన్ని సీన్స్ తెరకెక్కించారు. తదుపరి షెడ్యూల్ ని లఖ్నో లో ప్లాన్ చేశారు. లఖ్నో లో ప్రాచుర్యం పొందిన జహంగీరాబాద్ ప్యాలెస్, నడ్వా కళాశాల, ముసాబాఘ్ ప్యాలెస్ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయాలి.
కానీ ఈ షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది. ప్రాచీన కట్టడమైన ముసాబాఘ్ ప్యాలెస్ లో చిత్రీకరణకు అక్కడి పురావస్తు శాఖ అధికారులు అనుమతిని ఇవ్వలేదు. దీంతో చిత్ర బృందం ఆలోచనలో పడింది. అనుమతి లభించే ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనీ భావిస్తోంది. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ కాంబినేషన్లో వస్తున్న భరత్ అనే నేనుపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















