Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది
- January 27, 2026 / 12:41 PM ISTByPhani Kumar
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi). ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించారు.
Bhartha Mahasayulaku Wignyapthi Collections
టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ‘బెల్లా బెల్లా’ ‘అద్దం ముందు నిలబడి’ ‘వామ్మో వాయ్యో’ వంటి పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

దీంతో సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాకి కొంత బజ్ క్రియేట్ అయ్యింది. మొదటి రోజు సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. దీంతో సో సో ఓపెనింగ్స్ వచ్చాయి.పండుగ హాలిడేస్ ఓకే అనిపించుకున్నా.. చెప్పుకోదగిన రేంజ్లో అయితే కలెక్ట్ చేయలేదు.పండుగ ముగిశాక కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 2.98 cr |
| సీడెడ్ | 0.91 cr |
| ఆంధ్ర(టోటల్) | 5.66 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 9.55 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.72 cr |
| ఓవర్సీస్ | 1.13 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 11.4 కోట్లు(షేర్) |
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజుల్లో ఈ సినిమా రూ.11.4 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.19.35 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
















