సంక్రాంతి బరిలో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమా కూడా నిలవనున్న సంగతి తెలిసిందే.జనవరి 13న విడుదల కానుంది ఈ సినిమా. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించాడు. ‘బెల్లా బెల్లా’ ‘అద్దం ముందు’ ‘వామ్మో వాయ్యో’ వంటి పాటలు ఆకట్టుకున్నాయి. టీజర్ కూడా ఓకే అనిపించింది. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు.
ఇక ఈ ట్రైలర్ 2 నిమిషాల 19 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు,కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్ .. ఓ తెగ చేసేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు’ అంటూ రవితేజ పలికిన డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ వెంటనే కమెడియన్ సత్య ‘రెడీ బాబు’ అంటూ బోయపాటి స్టైల్లో కామెడీ డైలాగ్ పలికాడు. ఆ తర్వాత కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. భార్యకి, ప్రియురాలికి మధ్య నలిగిపోయే హీరో కథ ఇది.

అయితే కాన్ఫ్లిక్ట్ పాయింట్ పై ఎటువంటి హింట్ ఇవ్వలేదు. మొత్తం ఎంటర్టైన్మెంట్ పైనే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ డైలాగ్ ను సత్యతో కామెడీగా పలికించారు. మంచు మనోజ్ – మంచు మనోజ్..ల వివాదం టైంలో హైలెట్ అయిన ‘జెనరేటర్లో పంచదార వేయడం’ అనే అంశాన్ని తీసుకుని కామెడీ పండించే ప్రయత్నం చేశారు. మొత్తానికి సినిమాపై కొంత బజ్ పెంచే విధంగానే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ ని కట్ చేశారు అని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :
