అల్లూరి, భీమ్ కి అన్నయ్యాడు.. అదిరిపోయే ట్విస్ట్!

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచాన్ని కుదిపివేస్తున్న తరుణంలో సినీ ప్రేమికులకు ఆహ్లాదం పంచుతూ రాజమౌళి ఎవరూ ఊహించని విధంగా ఉగాది కానుకగా ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ మోషన్ పోస్టర్ లో ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్ మరియు చరణ్ లను పరిచయం చేసిన తీరు, పాత్రల వెనకున్న కాన్సెప్ట్ ని నీరు-నిప్పుతో పోల్చడం వంటి విషయాలు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఇక తెలుగులో రౌద్రం రణం రుధిరం అనే పవర్ ఫుల్ పదాలతో కూడిన టైటిల్ నిర్ణయించారు. బానిసత్వ సంకెళ్లు తెంచే క్రమంలో ఇద్దరు వీరులు సాగించిన పోరాటం, చిందించిన రక్తం అనేదే ఈ మూవీ మెయిన్ థీమ్ అని టైటిల్ చూస్తే అర్థం అవుతుంది. కాగా నేడు చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని భీమ్ ఫర్ రామరాజు పేరుతో ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు.

“ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టు ఉంటది !
కలబడితే వేగుసుక్కా ఎగబడినట్టు ఉంటది !
ఎదురుబడితే సావుకైనా సెమట కారపడ్తది !
పాణమైన…బంధూకైనా,….వానికి బాంచన్ అయితది !!

ఇంటి పేరు అల్లూరి
సాకింది గోదారి
నా అన్న…మన్నెం దొర… అల్లూరి సీతారామ రాజు..” అంటుసాగే ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ ఓవర్ తో మొదలైన వీడియో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ గిఫ్ట్ లా గూస్ బమ్స్ కలిగించేలా ఉంది. రామ్ చరణ్ సాలిడ్ బాడీ మరియు పాత్ర తీరుని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. రామరాజు పాత్రలో చరణ్ వీరలెవల్లో ఉన్నాడు. జంధ్యం ధరించి, మెడలో ఓంకారంతో కూడిన లాకెట్ వేసుకుని ఉన్న చరణ్ బేర్ బాడీలో పోలీస్ ప్యాంటు ధరించి ఉండడం ఆసక్తిరేపుతుంది. అసలు అల్లూరి సీతారామరాజుగా చరణ్ గెటప్ అనేక పజిల్స్ విసిరింది. ఇక మన్యం వీరుడు సీతారామరాజు మా అన్న అని.. కొమరం భీమ్ ఎన్టీఆర్ చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. కొమరం భీమ్ కి అల్లూరి ఏ విధంగా అన్నయ్యాడు? అనేదే అసలు ప్రశ్న. ఇక తెలంగాణ మాండలికంలో ఎన్టీఆర్ వాయిస్ చాల గంభీరంగా, అద్భుతంగా ఉంది. చరణ్ పాత్రని ఈ రేంజ్ లో పరిచయం చేసిన జక్కన్న మరి కొమరం భీమ్ ఎన్టీఆర్ ని ఎలా చూపించనున్నాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus