Pawan Kalyan: తగ్గేదేలే అంటున్న పవన్.. కారణాలివే?

2022 సంవత్సరం సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో భారీస్థాయిలో పోటీ ఉందనే సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ రిలీజ్ కానుందని కొన్ని నెలల క్రితమే ప్రకటన వెలువడింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆర్ఆర్ఆర్ కు పోటీగా భీమ్లా నాయక్ ను రిలీజ్ చేయకపోవచ్చనే కామెంట్లు వినిపించాయి. అయితే సంక్రాంతి రేసులో భీమ్లా నాయక్ మూవీ కూడా ఉందని సమాచారం.

ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు ఈ మేరకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. థియేటర్లను సిద్ధం చేసుకోవాలని నాగవంశీ డిస్ట్రిబ్యూటర్లకు సూచించారని బోగట్టా. పవన్ కళ్యాణ్ కూడా రిలీజ్ డేట్ ను మార్చవద్దని నిర్మాతలకు సూచించినట్టు సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో చిరంజీవి భీమ్లా నాయక్ డేట్ ను మార్చే దిశగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాల్సి ఉంది. భీమ్లా నాయక్ వల్ల రాజమౌళి సైతం టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సంక్రాంతి పోటీ వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ భారీ బడ్జెట్ కావడంతో రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు సంబంధించి టెన్షన్ పడుతున్నారు. సంక్రాంతి సమయానికి ఎన్ని సినిమాలు పోటీలో నిలుస్తాయో చూడాల్సి ఉంది. రాధేశ్యామ్ కూడా సంక్రాంతికే రిలీజ్ కానున్న నేపథ్యంలో థియేటర్లకు సంబంధించి సమస్యలు ఏర్పడే ఛాన్స్ కూడా ఉందని చెప్పవచ్చు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus