పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించారు. ఫిబ్రవరి 25న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్ట్ చేసింది.అయితే రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది.ఇక 11వ రోజున అయితే మరింత దారుణం అని చెప్పాలి. ఒకసారి 11 రోజుల కలెక్షన్లు గమనిస్తే :
నైజాం
30.88 cr
సీడెడ్
10.72 cr
ఉత్తరాంధ్ర
7.24 cr
ఈస్ట్
5.36 cr
వెస్ట్
4.98 cr
గుంటూరు
5.05 cr
కృష్ణా
3.70 cr
నెల్లూరు
2.41 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
70.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
7.28 cr
ఓవర్సీస్
12.31 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
89.93 cr
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.89.93 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.20.07 కోట్ల షేర్ ను రాబట్టాలి. 11 వ రోజున ఈ చిత్రం రూ.0.40 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమనే చెప్పాలి..!