పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి కలయికలో ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మాణంలో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. నిత్యామీనన్, సంయుక్తమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే ను అందించడం విశేషం.తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఈ చిత్రం కోసం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022 లో విడుదల కాబోతున్న మొదటి పెద్ద సినిమా ఇదే. బుక్ మై షోలో బుకింగ్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి.మరోపక్క ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ రివ్యూ బయటకి రావడంతో అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమర్ సంధు ఈ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్థం’ ఈ భీమ్లా నాయక్.
కథ : ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ ‘భీమ్లా నాయక్'(పవన్ కళ్యాణ్) అనుకోకుండా ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ డానియల్ శేఖర్(రానా) ని మద్యం సేవించి దానిని రవాణా చేస్తున్న కేసులో పట్టుకుని అరెస్ట్ చేస్తాడు.అంతేకాదు అతని పంచ ఊడగొట్టి, చితకొట్టి మరీ పోలీస్ స్టేషన్ కు తరలిస్తాడు. డానియల్ శేఖర్ మాజీ ఆర్మీ ఆఫీసర్ అని భీమ్లా నాయక్ కు తెలీదు. అలాగే ఇతను ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పెద్ద(సముద్రఖని) కొడుకు అన్న సంగతి కూడా తెలీదు.
అయితే డానియల్ శేఖర్ గురించి అసలు నిజం తెలుసుకున్న వెంటనే ‘భీమ్లా నాయక్’… డానియల్ శేఖర్ కు సారి చెప్పి విడుదల చేయించే ప్రయత్నాలు చేపడతాడు. కానీ డానియల్ శేఖర్… జరిగిన అవమానాన్ని తట్టుకోలేక భీమ్లా ఉద్యోగం కోల్పోయేలా చేస్తాడు. దీంతో డానియల్ పై కోపం పెంచుకుంటాడు భీమ్లా. అటు తర్వాత ఒకరి పై మరొకరు దాడి చేసుకుంటూ… చివరికి చంపుకునే వరకు వెళ్తారు? ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలు, చివరికి వీళ్ళ మధ్య యుద్ధం ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ.
“పవన్ ఈ చిత్రంలో కోపిష్టి పోలీస్ గా విశ్వరూపం చూపెట్టాడు. రానా ఇంట్రడక్షన్ సీన్ అదిపోయింది. పవన్ కళ్యాణ్ ఇంట్రో కూడా ఫ్యాన్స్ కు పూనకాలు తెచ్చే విధంగా ఉంది. వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ ఆడియెన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి. వీళ్ళ తర్వాత నిత్యా మేనన్ పాత్ర గురించి చెప్పుకోవాలి. ఆ ఇద్దరి హీరోలకి తగ్గని విధంగా ఇంకా చెప్పుకోవాలంటే ఈమె కూడా ఓ హీరో టైపు పాత్రని పొంది దానికి జీవం పోసింది.
తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఒక్క పవన్ అభిమానులకే కాదు మాస్ ఆడియెన్స్ ను కూడా ఈ చిత్రం ఫుల్ గా సంతృప్తి పరుస్తుంది” అంటూ ఉమర్ చెప్పుకొచ్చి ఏకంగా 4/5 రేటింగ్ ఇచ్చేసాడు. మరి అతని రివ్యూకి తగినట్టుగా సినిమా ఉంటుందో లేదో విడుదల రోజున తెలుస్తుంది. ఇతను ఆకాశానికి ఎత్తేసినంతలా అయితే ఇతను రివ్యూలు ఇచ్చిన సినిమాలు ఉండవు. అందులో చాలా సినిమాలు నిరాశపరిచినవి కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
First Review #BheemlaNayak from Censor Board : A mass entertainer with power-packed drama, hi-intensity dialogue and towering performances as its aces. #PawanKalyan the actor delivers a towering performance, grabbing your attention the moment he enters the story.
Thank God ! Our Power Star is Back in his Favourote Genre.
This is called ” BLOCKBUSTER COME BACK FILM “.#BheemlaNayak is not a film, it’s a Celebration 💥💥🔥🔥🔥 ! What an Outstanding Mass Saga. #RanaDaggubati v/s #PawanKalyan
What a Film !!! Fans will go gaga over it. 🙏 pic.twitter.com/ZJTJNC4ODI