Bheemla Nayak: వాళ్లు ఫోన్‌ కమర్షియల్‌ హిట్‌ కొట్టవన్నారట!

‘భీమ్లా నాయక్‌’ రీమేక్‌ కాదు… ఏంటీ ఏదో సెన్సేషన్‌ కోసం రాసిన వార్త అనుకుంటున్నారా? లేకపోతే ఇంకెవరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడానికి చెప్పిన మాట అనుకుంటున్నారా? అవేవీ కాదు. ఎందుకంటే ఈ మాట అన్నది మేం కాదు, ఎవరో కాదు. ఆ సినిమా దర్శకుడే. అవును సాగర్‌ కె.చంద్రనే ఈ సినిమా గురించి ఇలా మాట్లాడింది. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమాను తెలుగులో ‘భీమ్లా నాయక్‌’గా రూపొందించారు. అయితే ఈ క్రమంలో సినిమాను ఒరిజినల్‌ సినిమానే మలిచారట.

నిర్మాత నాగవంశీ వల్లే సాగర్‌ చంద్రకు ‘భీమ్లా నాయక్‌’ సినిమా చేసే అవకాశం వచ్చిందనే విషయం తెలిసిందే. గతంలోనే సాగర్‌ చంద్ర చెప్పారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా రావడంతో మరింత ఆత్రుతగా అనిపించిందట. ‘వకీల్‌ సాబ్‌’ సెట్లో ఉన్నప్పుడు తొలిసారి ఈ సినిమా కోసం పవన్‌ను కలిశారట సాగర్‌ చంద్ర. ‘బాగా తీయ్‌… బాధ్యతగా పనిచేయ్‌’ అని పవన్‌ చెప్పారట. త్రివిక్రమ్‌తో ప్రయాణం ప్రారంభమయ్యాక మొదట మలయాళంలోని అయ్యప్పన్‌ పాత్రను భీమ్లా నాయక్‌గా ఎలా మార్చాలనే విషయం గురించి చర్చ మొదలైందట.

ఆ నేపథ్యంలో త్రివిక్రమ్‌ ఓసారి మాట్లాడుతూ… ‘సాగర్‌ రీమేక్‌ అనే విషయాన్ని మన మనసులో నుంచి తీసేసిఈ సినిమా చేద్దాం’ అని సూచించారట. అంతేకాదు ‘ఈ సినిమా ఎలా ఉండాలంటే… దీని రీమేక్‌ హక్కుల్ని మరొకరు తీసుకోవాలనేంతగా మనం సినిమాను మారుద్దాం’ అని త్రివిక్రమ్‌ అన్నారట. అందుకే ‘భీమ్లా నాయక్‌’ను ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ అనడం కంటే… అలాంటి సినిమా అంటే బాగుంటుందేమో అని అన్నారు సాగర్‌ చంద్ర. మాతృక ‘అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌’లో చాలా చోట్ల ముందుకు సాగకుండా కథ ఆగిపోతుంది.

ఇద్దరి మధ్య ఈగో క్లాష్‌ సీన్స్‌ మాత్రమే వచ్చి వెళ్తుంటాయి. నిజానికి అలాంటి సన్నివేశాలు మన ప్రేక్షకులకి అంతగా నచ్చవు. అందుకే అలాంటి చోట్ల మార్పులు చేసి ఈ సినిమా తీశాం. యాక్షన్‌ కంటే భావోద్వేగాలే ఎక్కువగా పండేలా ఈ సినిమా తీర్చిదిద్దాం. ఇప్పుడు ఆ సన్నివేశాలే ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి అని సాగర్‌ చంద్ర చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus