సంక్రాంతికి మేమోస్తున్నామంటే మేమోస్తున్నాం అంటూ హడావుడిగా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసేశారు అందరూ. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్, చిరంజీవి ఆచార్య, వెంకటేష్ ఎఫ్ 3. ఇలా అందరూ సంక్రాంతి స్లాట్ ను పంచేసుకున్నారు. అంతా బాగానే ఉంది, సంక్రాంతి నుండి సినిమా సంబరాలు షురూ అనుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకులు. అప్పుడు రంగంలోకి వచ్చింది “ఆర్ ఆర్ ఆర్”.
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా అన్నీ ఇండస్ట్రీల చూపును తనవైపుకు తిప్పుకున్న ఆర్ ఆర్ ఆర్ జనవరి 7వ తారీఖున రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించడంతో.. మిగతా సినిమాలన్నీ సైడైపోయాయి. ప్రభాస్ “రాధేశ్యామ్” మాత్రం జనవరి 14 డేట్ ను రీకన్ఫర్మ్ చేయగా.. మిగతా సినిమాలన్నీ వేరే రిలీజ్ డేట్స్ ను వెతుక్కుంటున్నాయి. చిరంజీవి ఆచార్య ప్రీపోన్ అయ్యే అవకాశాలు ఉండగా.. పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి పోస్ట్ పోయ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు కానీ.. సినిమా పోస్ట్ పోన్ అనేది మాత్రం ప్రస్తుతానికి కన్ఫర్మ్. మరి సర్కారు వారి పాట పరిస్థితి ఏమిటో చూడాలి. ప్రీపోన్ చేయలంటే టైమ్ సరిపోదు, పోస్ట్ పోన్ చేస్తే డేట్స్ దొరకవు. సో సర్కారు వారి పాటను మరీ సమ్మర్ వరకూ ఆపకుండా ఫిబ్రవరి లేదా మార్చిలోపే విడుదల చేసే అవకాశాలున్నాయి.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!