టెక్నాలజీ పెరిగితే మంచికి వాడుకోవాలి కానీ… వేలాదిమంది కష్టాన్ని అప్పనంగా కొట్టేయడానికి కాదు కదా. ఈ విషయం సినిమాలను, సినిమా పాటల్ని, సీన్స్‌ని లీక్ చేస్తున్నవాళ్లకు అర్థం కావాలి. వందలాది, వేలాదిమంది కష్టపడి ఎంతో ప్రేమగా తీసుకొస్తున్న పాటల్ని గోడచాటున, ముసుగు చాటున ఉండి లీక్ చేసేయడం ఎంతవరకు కరెక్ట్. ఇదంతా ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘కళావతి…’ పాట గురించి మాత్రమే కాదు. ‘భీమ్లా నాయక్’ పాట గురించి కూడా.
అవును, ‘కళావతి..’ని ఫాలో చేస్తూ ‘భీమ్లా నాయక్’ పాటను కూడా లీక్ చేసేశారు కొందరు. అయితే ఈసారి వాళ్లకు పాటంతా దొరకలేదు. పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేస్తున్న చిన్న బిట్ మాత్రమే దొరికింది. దానినే రిపీట్ చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేసేశారు. ‘భీమ్లా నాయక్’లోని పాట షూటింగ్ ప్రస్తుతం చేస్తున్నారు. దీంతో మొత్తం కంప్లీట్ అవుతుంది. దీంతో హమ్మయ్య ఒక పని అయిపోయింది అని టీమ్ అనుకుందాం అని అనుకుంటే… లీక్ చేసి మూడ్ మొత్తం స్పాయిల్ చేసేశారు.
‘భీమ్లా నాయక్’ సాంగ్‌ను ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. అందులో ఓ వీధి రోడ్డులో పవన్ కల్యాణ్, పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లపై ఈ పాటను తెరకెక్కించారు. దీనికి దూరంగా ఓ గోడ మీద నిలబడి ఒక వ్యక్తి తన ఒప్పొ రెనో ఫోన్‌లో షూట్ చేసేశాడు. ఆ ఫోన్ వాడే వ్యక్తి తన పేరును రాకింగ్ స్టార్ అని పెట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘కళావతి…’ పాట లీక్‌తో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ ఇప్పుడు మళ్లీ అంతటి పని చేసింది.
‘కళావతి..’ పాట లీక్ అయినందుకు తమన్ చాలా బాధపడ్డాడు. ఇప్పుడు లీక్ అయిన ‘భీమ్లా ’ పాటకు కూడా ఆయనే సంగీత దర్శకుడు. దీంతో తమన్ ఇంకా బాధలో ఉంటాడు. అయినా ఇలాంటి చిన్న చిన్న బిట్‌లు లీక్ చేస్తే ఏమొస్తుందో ఆనందం. సినిమా వాళ్ల కష్టాన్ని హరించడం తప్ప. ముందెప్పుడో చెప్పినట్లు పైరసీని మించిన కష్టం ఈ లీకేజీ. ప్లీజ్ స్టాప్ లీకేజీ.
— Dream Boy Nani (@DreamBoyNani3) February 13, 2022
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!