నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ‘భీష్మ’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే సూపర్ హిట్ లిస్ట్ లో చేరింది. వరుసగా 3 ప్లాప్ లతో సతమతమవుతోన్న నితిన్ ఈ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం .. రెండో వారంలో కూడా పర్వాలేదనిపించింది.
ఇక 2 వారాల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
| నైజాం | 8.78 cr | 
| సీడెడ్ | 3.20 cr | 
| ఉత్తరాంధ్ర | 2.96 cr | 
| ఈస్ట్ | 1.70 cr | 
| వెస్ట్ | 1.27 cr | 
| కృష్ణా | 1.53 cr | 
| గుంటూరు | 1.79 cr | 
| నెల్లూరు | 0.76 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.91 cr | 
| ఓవర్సీస్ | 3.19 cr | 
| వరల్డ్ వైడ్ టోటల్ | 27.09 cr | 
‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 27.09 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల దిశగా అడుగులు వేస్తుంది. మరి ఈ 3వ వీకెండ్ ను ‘భీష్మ’ ఎంత వరకూ క్యాష్ చేసుకుంటాడు అనేది చూడాల్సి ఉంది.
Click Here To Read Bheeshma Movie Review
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!