Bhola Shankar OTT: ‘భోళా శంకర్’ డిజిటల్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవల అంటే ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ డివైడ్ టాక్ ను మూటగట్టుకుంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత. చిరు మార్క్ ఎలివేషన్స్, ఆయన లుక్స్, అలాగే యాక్షన్ బ్లాక్స్ వంటివి బాగానే ఉన్నప్పటికీ కామెడీ సరిగ్గా పండలేదు

అలాగే ఫస్ట్ హాఫ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం (Bhola Shankar) స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటన అయితే వచ్చింది కానీ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 18 న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది అని తెలుస్తుంది. ఆరోజు వినాయక చవితి పండుగ కూడా కావడంతో .. నెట్ ఫ్లిక్స్ వారు ఆ రిలీజ్ డేట్ కి ‘భోళా శంకర్’ ని ప్రసారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి థియేటర్లలో పెద్దగా అలరించలేకపోయిన ‘భోళా శంకర్’ ఓటీటీలో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus