Bhuma Mounika Reddy: భూమా మౌనిక ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • March 5, 2023 / 04:20 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో భూమా మౌనిక పేరు మారుమ్రోగుతోంది. భూమా మౌనిక, మనోజ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా మనోజ్ మౌనిక జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. భూమా మౌనిక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆమె ఆస్తుల విలువ 2000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. మౌనిక మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే, మొదటి భర్త నుంచి మౌనికకు భరణంగా 250 కోట్ల రూపాయలు వచ్చాయని బోగట్టా.

మౌనిక పేరుపై కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ఆళ్లగడ్డ, కర్నూలు చుట్టప్రక్కల ప్రాంతాల్లో ఆమె పేరుపై ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. భూమా మౌనిక మనోజ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని బోగట్టా. గతంలో చాలా సందర్భాల్లో రెండో పెళ్లి వార్తల గురించి ఖండించిన మనోజ్ భూమా మౌనిక గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చిన సమయంలో మాత్రం స్పందించలేదనే సంగతి తెలిసిందే.

మనోజ్, మౌనిక ఒకరికొకరు కెరీర్ పరంగా హెల్ప్ చేసుకోనున్నారని తెలుస్తోంది. మనోజ్ సినిమాల్లో సత్తా చాటే దిశగా అడుగులు వేస్తుండగా మౌనిక మాత్రం రాజకీయాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. మనోజ్, మౌనిక కెరీర్ ప్లానింగ్ కు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మనోజ్ తో పెళ్లి తర్వాత భూమా మౌనికకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

మనోజ్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని బోగట్టా. మనోజ్ వాట్ ద ఫిష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మనోజ్ రెమ్యునరేషన్ సైతం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మనోజ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus