Mounika: గతాన్ని తలుచుకుని మనోజ్ భార్య మౌనిక ఎమోషనల్ కామెంట్స్!

  • April 13, 2023 / 07:48 PM IST

మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరి వివాహం అంత ఈజీగా అయితే అవ్వలేదు. చాలా ఆటంకాలు, మానసిక ఒత్తిడి.. వంటి వాటిని అధిగమించి ఫైనల్ గా పెద్దలను ఒప్పించి ఓ ఇంటి వారైనట్టు తెలుస్తోంది.ఇటీవల కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న ఓ షోలో మ‌నోజ్‌, మౌనికా దంపతులు పాల్గొన్నారు.వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చింది. వెన్నెల కిషోర్ కు టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది.

ముఖ్యంగా మనోజ్ తో.. వెన్నెల కిషోర్ స్నేహం ఈనాటిది కాదు. వీరి మధ్య 12 ఏళ్ళ నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే మనోజ్ దంపతులను ఇంత త్వరగా ఈ షోకి తీసుకురాగలిగాడు వెన్నెల కిషోర్. ఇక ఈ షోలో మనోజ్.. మౌనికతో ప్రేమ, పెళ్లి విషయంలో చాలా ఆటంకాలు.. ఎంతో మనో వేదన అనుభవించి చివరికి ఒక్కటైనట్టు తెలిపాడు. ఇదే క్రమంలో మౌనిక గతాన్ని తలుచుకుని కొన్ని ఎమోషనల్ కామెంట్లు చేసింది. ‘‘అమ్మ చనిపోయిన త‌ర్వాత బ‌ర్త్ డే రోజున అలా ఆకాశం చూస్తూ ‘ఎక్క‌డున్నావ్‌.. నాకేం కావాలో నీకు తెలుసు..

అంతా నీకే వ‌దిలేస్తున్నాను’ అని అనుకున్నాను. మనోజ్ ఆరోజు ఆళ్లగడ్డకి వస్తాడని అనుకోలేదు. (Mounika) నా జీవితంలో నేను అది మరచిపోలేను.” అంటూ మౌనిక తన గతాన్ని తలుచుకుని ఏదో చెబుతుంది. ప్రోమో కాబట్టి అది ఏ విషయం గురించి అన్నది రివీల్ కాలేదు. ఆ తర్వాత మనోజ్.. “నేను వెళ్ళాలి. అక్కడే ఉండాలి అని మ‌న‌మే ఊహించేసుకుని, నేను అక్క‌డికి వెళ్లి హెల్ప్ చేయాల‌నుకున్న‌ప్పుడు ఇబ్బందులు ప‌డ్డాను. మ‌నం అనుకున్న‌ట్లే ప్రేమించాం.

ప్రేమ అనేది రెండు ప‌క్క‌లా ఉండాలి. ఎటు ప‌క్క నిల‌బ‌డుతున్నానో, ఎక్క‌డున్నానో ఏం అర్థం కాలేదు. స‌రే నీకు లవ్ లైఫ్ కావాలా, సినిమా కావాలా సెల‌క్ట్ చేసుకో అనే ప‌రిస్థితి కూడా వచ్చింది. మ‌న‌ల్ని న‌మ్ముకుని బిడ్డతో ఓ అమ్మాయి లైఫ్ నిల‌బ‌డింది నా కోసం. నేను బ్ర‌తికి కూడా వేస్ట్ ఈ జన్మ‌కి.. ఎన్ని డోర్లు మూస్తారో మూయండి’’ అంటూ మనోజ్ చెప్పడం.. అతని ఫ్యామిలీలో పెళ్లి కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలియజేస్తున్నట్టు ప్రోమో ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus