Manoj, Mounika: ఫస్ట్ టైం భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసిన భూమా మౌనిక!

మంచు మనోజ్ గత నెల మూడవ తేదీ భూమా మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే పెళ్లిలో చేసుకుని విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ ప్రేమించుకొని కుటుంబ సభ్యుల అనుమతితో కొంతమంది సమక్షంలో వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత మనోజ్ భూమా మౌనికతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భార్యపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ వచ్చారు..

ఇక వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నప్పటికీ వారి ప్రేమ విషయాన్ని బయటకు రాకుండా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి భూమా మౌనిక తన భర్త మంచు మనోజ్ తో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనోజ్ తో పోలిస్తే మౌనిక సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఇప్పటివరకు ఈమె తన పెళ్లికి సంబంధించిన ఏ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. అయితే మొదటిసారి తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

ఈ ఫోటోలో మౌనిక ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ సభ్యచాసి శారీలో కూర్చిలో కూర్చొని ఉండగా మనోజ్ తన వెనుక నిలబడ్డారు.చాలా అందంగా ఉన్నటువంటి ఈ ఫోటోని మౌనిక షేర్ చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ జంట వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి అలా మొదలైంది కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే. ఈ షోలో భాగంగా ఈ ఫోటో దిగినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మౌనిక (Bhuma Mounika) మొదటిసారి ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇక అలా మొదలైంది కార్యక్రమంలో ఈ జంట పాల్గొనగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అయితే ఈ ప్రోమోలో వారిద్దరూ వారి ప్రేమను గెలిపించుకొని ఒక్కటవ్వడం కోసం ఎలాంటి కష్టాలను పడ్డారనే విషయాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మనోజ్ మౌనిక ఒకటయ్యారని వీరి ప్రేమ గురించి ఈ సందర్భంగా బయటపెట్టినట్లు తెలుస్తోంది.


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus