సీటీమార్ లో కీలకం కానున్న భూమిక క్యారెక్టర్

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ యాక్టర్స్ తో మాత్రమే కాక చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోస్ తోనూ నటించిన ఘనత సొంతం చేసుకున్న భూమిక అనంతరం నిర్మాతగా మారి రెండు సినిమాలు కూడా నిర్మించించి. అఫ్కోర్స్ ఆ సినిమాలతో భారీగా నష్టపోయిందనుకోండి. ఆ తర్వాత భారత్ ఠాకూర్ ను పెళ్లాడి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించింది కానీ.. ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా చిన్న సినిమాల్లో నటించడం మొదలెట్టింది. కొన్నాళ్ళకు హీరోయిన్ గా ఆఫర్లు తగ్గడంతో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేయడం కూడా స్టార్ట్ చేసింది. హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయడం కూడా మొదలెట్టింది.

నానితో కలిసి “మిడిల్ క్లాస్ అబ్బాయి”లో వదిన పాత్ర పోషించింది. ఆ తర్వాత “సవ్యసాచి”లోనూ నాగచైతన్యకు అక్కగా నటించింది. ఈ రెండు సినిమాలూ ఆమెకు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. రీసెంట్ గా “రూలర్”లో పోషించిన రోల్ కూడా భూమిక కెరీర్ కు ఎలాంటి హెల్ప్ చేయలేకపోయింది. అయితే.. గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సీటీమార్” సినిమాలో సిస్టర్ రోల్ పోషించనున్న భూమిక క్యారెక్టర్ కథ-కథనంలో కీలకపాత్ర పోషించనున్నాయట. మరి భూమికకు ఈ సినిమాలో సిస్టర్ రోల్ ఏమేరకు ప్లస్ అవుతుంది అనేది తెలియాలంటే విడుదల వరకూ వెయిట్ చేయాల్సిందే.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus