Virata Parvam: రానా ‘విరాటపర్వం’కి కలిసొచ్చిన అవకాశం!

కరోనా కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ ఏడాది పెద్ద సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్స్ క్యూ కట్టడంతో మీడియం బడ్జెట్ సినిమాలన్నీ సైడ్ అయిపోయాయి. నిన్నమొన్నటి వరకు అదే పరిస్థితి. ఇప్పుడు మీడియం, చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రతీవారం ఓ కొత్త సినిమా రావడంతో సెకండ్ వీక్ లో సినిమాలు మంచి కలెక్షన్స్ ను రాబట్టలేకపోతున్నాయి. గతవారం ‘విక్రమ్’, ‘మేజర్’ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి.

కానీ రీసెంట్ గా ‘అంటే సుందరానికి’ సినిమా రిలీజవ్వడంతో ఆ రెండు సినిమాల కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. ఇలా ప్రతీవారం మినిమమ్ బజ్ ఉన్న సినిమాలు వస్తున్నప్పటికీ.. రానా ‘విరాటపర్వం’ సినిమాకి మాత్రం రెండో వారం టఫ్ ఫైట్ ఇచ్చే సినిమా లేదు. ‘విరాటపర్వం’ విడుదలైన నెక్స్ట్ వీక్ తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రిలీజ్ కావడం లేదు. జూన్ 17న వస్తున్న ఈ సినిమాకి గట్టి పోటీ కూడా లేదు. సత్యదేవ్ ‘గాడ్సే’ ఒక్కటి మాత్రం రిలీజ్ అవుతోంది.

దీనికి కూడా పెద్ద బజ్ లేదు. ‘విరాటపర్వం’ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా.. రెండు వారాలు మంచి కలెక్షన్స్ ను రాబట్టడం ఖాయం. పైగా.. సాయిపల్లవి ఇందులో హీరోయిన్ గా నటించింది. హీరోల రేంజ్ లో ఆమెకి క్రేజ్ ఉంది. సో కచ్చితంగా యూత్ ఈ సినిమా థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. పాటలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి!

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus