Mega Family: మెగా హీరోల నాన్ స్టాప్ సినిమాలు.. గేట్ రెడీ!

తమ అభిమాన హీరోలను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా వివిధ కారణాలతో మెగా హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే మరికొద్ది నెలల్లో మెగా అభిమానులకు నాన్‌స్టాప్‌ ట్రీట్‌ వచ్చేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మెగా హీరోలు నటిస్తున్న వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముందుగా వరుణ్ తేజ్ మెగా అభిమానుల్లో సంబరాలను ప్రారంభించబోతున్నాడు. అతని స్పోర్ట్స్-డ్రామా గని పరిస్థితిని బట్టి ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న తెరపైకి రావచ్చు.

త్వరలోనే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25న వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పరిస్థితులు అనుకిలించకపోతే ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రావచ్చు. వీలైనంత వరకు నిర్మాతలు ముందుగానే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక రామ్ చరణ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR మార్చి 25 న రానుంది.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఆచార్య కూడా ఏప్రిల్ 29 విడుదల తేదీని రానుంది. ఇక వరుణ్ తేజ్ మరో కామెడీ చిత్రం ఎఫ్ 3 ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇది షెడ్యూల్ ప్రకారం వస్తుందా లేదా మరింత ముందుకు నెట్టబడుతుందా అనేది ఇంకా తెలియదు. అనుకున్న సమయానికి వస్తే ఆ వీకెండ్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుంది. ఏది ఏమైనా ఇప్పటి నుండి వచ్చే మూడు నెలల పాటు ప్రతి నెలా వెండితెరపై మెగా అభిమాన హీరోలను చూసుకునే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా మధ్యలో వారి కొత్త సినిమాలకు సంబంధించిన బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మెగా జాతర హై లెవెల్లో ఉండేలా కనిపిస్తోంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus