బిగ్ బాస్ షో అంటేనే టాస్క్ లు ఆడటం – గెలవడం. అయితే, ఒకవైపు హౌస్ మేట్స్ ని గెలుస్తూనే మరోవైపు మనం ఎంత జెన్యూన్ గా గేమ్ ఆడాం అనేది చూపిస్తూ ఆడియన్స్ మనసులు కూడా గెలవాలి. ఈ రెండు చేస్తేనే బిగ్ బాస్ టైటిల్ మన సొంతం అవుతుంది. టాస్క లు ఆడినా – ఆడకపోయినా మన బిహేవియర్ పబ్లిక్ కి నచ్చితే చాలు. ఖచ్చితంగా విన్నర్ అవుతాం. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 లో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరుగుతోందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి ఇలా అందర్నీ ఎలిమినేట్ చేయడం కరెక్ట్ గా లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మేము ఓట్లు వేసినా కూడా ఎలా ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి ఫస్ట్ సీజన్ , సెకండ్ సీజన్ లలో బిగ్ బాస్ ఓటింగ్ ని ఆన్ లైన్లో గూగుల్ ద్వారా వేసేవారు. కానీ, తర్వాత సీజన్ 3 నుంచి హాట్ స్టార్ యాప్ లో వేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ్నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. అసలు ఎలిమినేషన్ ఎలా చేస్తున్నారు. ఫెయిర్ గా చేయట్లేదని ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ సైతం మొత్తుకుంటున్నారు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నామని ముందుగానే తెలిసి చాలామంది హౌస్ మేట్స్ ఓట్లకోసం ముందుగానే ప్రిపేర్ అయి షోకి వస్తున్నారని బయటకి వచ్చి ఇంటర్య్వూస్ లో చెప్తున్నారు. ఇవన్నీ చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు ఓటింగ్ ని పబ్లిక్ చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. ఓటింగ్ లో గ్యాంబ్లింగ్ చేస్తున్నారని, పబ్లిక్ గా ప్రేక్షకులకి మాత్రం చూపించినా బాగుంటుందని అంటున్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయనేది చెప్తే వారి ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం ఇంకా ప్రమోషన్స్ చేస్కునే వీలుంటుంది కదా అని అంటున్నారు.
అంతేకాదు, చాలామంది బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ని బట్టీ ఓటింగ్ చేయాలని ఈవారం ఎవరు బాగా ఆడారో చూసుకుని ఓట్లు వేయాలని ప్రేక్షకులకి చెప్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ – ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇలా ఎలిమినేట్ అయిపోతే ఎవరో బిగ్ బాస్ టైటిల్ ని తీస్కోవడం ఏంటి అని వారి ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు. మరి బిగ్ బాస్ టీమ్ వీళ్ల ఆవేదనని చూసి ఓటింగ్ ని పబ్లిక్ గా చెప్తారా లేదా అనేది చూడాలి.