పుష్ప మూవీ : ఇండస్ట్రీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ఇంట్ర‌స్టింగ్ చ‌ర్చ ఇదే..!

టాలీవుడ్ మాస్ట‌ర్ మైండ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఈ ఇద్ద‌రి నుండి వ‌చ్చిన గ‌త చిత్రాలు ఇండ‌స్ట్రీ హిట్‌లే. రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన రంగస్థ‌లం చిత్రాన్ని సుకుమార్ ఎలా చెక్కాడో అంద‌రికీ తెలిసిందే. చెర్రీ కెరీర్‌లోనే మైలురాయి లాంటి చిత్రాన్ని అందించాడు ఈ క్రియేటివ్ మాస్ట‌ర్. మ‌రోవైపు త్రివిక్రిమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం బ‌న్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

మామూలుగానే చెప్పుకోవాలంటే సుక్కు అండ్ బ‌న్నీల‌ది హిట్ కాంబినేష‌న్. అలాంటిది ఈ ఇద్ద‌రి గ‌త చిత్రాలు ఇండస్ట్రీ హిట్‌లు కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఓ రేంజ్‌లో భారీగా ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే విడుద‌లైన పుష్ప ఫ‌స్ట్‌లుక్ బ‌న్నీ అభిమానుల్ని గాల్లో తేలేలా చేసింది. ఖ‌ర్చు ఎంతైనా వెనుకాడ‌ని మైత్రి లాంటి నిర్మాణ సంస్థ‌, క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక‌, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్, ఇలా ఈ సినిమాకు సంబంధించి సెట‌ప్ అంతా బాగానే సెట్ చేసుకున్నాడు సుకుమార్.

1980ల నేపథ్యంలో తెరకెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సుకుమార్. అందులో చెర్రిని సిట్టిబాబుగా ప్రెజెంట్ చేసిన విధానం పై ప్రితి ఒక్క‌రి నుండి ప్ర‌శంస‌లు ద‌క్క‌డ‌మే కాకుండా, అప్పటి వ‌ర‌కు చ‌ర‌ణ్‌కు ఉన్న‌ క‌మ‌ర్షియ‌ల్ హీరో ముద్ర‌ను చెరిపివేసింది రంగ‌స్థ‌లం. సిట్టిబాబు లాంటి పాత్ర మ‌ళ్ళీ త‌న జీవితంలో రాద‌ని చెర్రి కూడా చెప్పాడంటే, ఆ క్యారెక్ట‌ర్‌లో ఉన్న మ్యాజిక్ అలాంటిది. అయితే ఇప్పుడు పుష్ప మూవీని కూడా 80స్ బ్యాక్‌డ్రాప్తోనే తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్.

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌గా పుష్ప‌రాజ్ క్యారెక్ట‌ర్‌ను కూడా సిట్టిబాబు పాత్ర‌లాగే డిజైన్ చేశాడ‌ని తెలుస్తోంది. అయితే ఓ సెన్షేష‌న్‌లా నిలిచిన సిట్టిబాబు పాత్ర‌ను పుష్ప‌రాజ్ మైమ‌రిపిస్తాడా అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సుకుమార్ అంటేనే త‌న సినిమాని నిధానంగా చెక్కుకుంటూ వెళ‌తాడు. కానీ ఇప్పుడు క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్ రావ‌డం, వెంట‌నే కొర‌టాల శివ‌తో బ‌న్నీ సినిమా ఉండ‌గా, మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ సినిమా చేయాల్సింది.

ఇక‌ మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఈ సినిమాని ఖ‌చ్ఛితంగా 2021 లోనే రిలీజ్ చేయాల్సి ఉంది. ఇలాంటి ప‌లు సిట్యువేష‌న్స్ నేప‌ధ్యంలో సుకుమార్, పుష్ప మూవీని ఎలా చెక్కుతాడు అనేది బ‌న్నీ అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. టేకింగ్ విష‌యంలో ఏమాత్రం తేడా కొట్టినా, రిజ‌ల్ట్ తారుమారు అవుతుంది. దీంతో సుకుమార్ చెక్కుడు పైనే స‌ర్వత్రా చ‌ర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రంగ‌స్థ‌లం సిట్టిబాబును, స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ బీట్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus