Katrina, Jahnvi: టాప్ హీరోయిన్లకు షాకిచ్చిన బాక్సాఫీస్!

రీసెంట్ గా బాలీవుడ్ లో రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏవ్ ‘ఫోన్ భూత్’, ‘మిలి’. కత్రినా కైఫ్ నటించిన ‘ఫోన్ భూత్’ సినిమాను గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేశారు. హారర్ కామెడీ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేతి కీలకపాత్రలు పోషించారు. పెళ్లి తరువాత కత్రినా ఫుల్ లెంగ్త్ లో నటించిన సినిమా ఇదే. రిలీజ్ కు ముందు సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. చిత్రబృందం ప్రమోషన్స్ కూడా బాగానే చేసింది.

కానీ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. అటు రివ్యూలు కానీ ఇటు పబ్లిక్ టాక్ కానీ ఏమాత్రం పాజిటివ్ గా లేకపోవడంతో బాలీవుడ్ లో మరో డిజాస్టర్ గ్యారెంటీ అని అంటున్నారు. సినిమాలో కంటెంట్ ఆశించిన స్థాయిలో లేదు. కత్రినా ఇమేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. మరోపక్క ‘మిలి’ విషయానికొస్తే.. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘హెలెన్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు.

సర్వైవర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ లో చూపించారు. ఎలాంటి మార్పులు చేయకపోవడంతో కొత్తగా ఈ సినిమాను చూడాలనే ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. ఒరిజినల్ వెర్షన్ చూసిన వారికి ‘మిలి’ పెద్దగా కనెక్ట్ అవ్వడం లేదు. అయితే జాన్వీకపూర్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇది థియేటర్ కంటెంట్ కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాలను ఓటీటీలో ఎంజాయ్ చేయగలం కానీ థియేటర్లో కష్టమేనని తేల్చేస్తున్నారు జనాలు. అయితే కత్రినా ‘ఫోన్ భూత్’ కంటే ఈ సినిమా కాస్త బెటర్ అని అంటున్నారు. మొత్తానికి కత్రినా, జాన్వీ కపూర్ లకు కూడా బాక్సాఫీస్ షాక్ తప్పలేదనే చెప్పాలి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus