Rajamouli, Sukumar: ఆర్. ఆర్. ఆర్, పుష్ప బ్యాక్ స్టెప్..!

కరోనా తగ్గుముఖం పట్టడం, డిసెంబర్- సంక్రాంతి నెలలు కావడంతో తెలుగు సినిమాకు సంబంధించి భారీ ప్రాజెక్ట్‌లు క్యూ కడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ఆర్ఆర్, పుష్పల గురించే . రెండు పాన్ ఇండియా సినిమాలు కావడంతో పాటు భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో వీటిపై అంచనాలు భారీగా వున్నాయి. ఈ రెండింటిలో పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండగా.. ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు దేశం దృష్టిని ఆకర్షించేందుకు గాను దుబాయ్‌లో భారీ ఈవెంట్‌కు ప్లాన్ చేశారట.

ఇప్పటి వరకు సైలెంట్‌గా వున్న జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం తన మార్క్ పబ్లిసిటీ స్ట్రాటజీని వుపయోగించనున్నారు. అందుకోసమే దుబాయ్‌లో ఓ ఈవెంట్ చేయాలని నిర్ణయించారట. దీనిలో భాగంగా రాజమౌళీ, కార్తీకేయ, దానయ్యలు దుబాయ్ వెళ్లి వేదికను చూసి వచ్చారట. అయితే ఎందుకో తెలియదు కానీ దుబాయ్ ఈవెంట్ క్యానిల్స్ అయినట్లుగా తెలుస్తోంది. పుష్ప మేకర్స్ కూడా ఇదే దారిలో నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణంగా లేకపోలేదు.. ఈ ఈవెంట్‌ కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలో చేసిన స్టార్స్‌ని తీసుకెళ్లడం, బస, ప్రయాణ ఖర్చులు, ఇతర అంశాలు పరిగణనలోనికి తీసుకుంటే నిర్మాతకు తడిసి మోపెడు అవుతుంది.

మరో వైపు కరోనా భయం కూడా వుండటంతో దుబాయ్ ప్లాన్‌ని జక్కన్న పక్కనబెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. పుష్ప నిర్మాతలు సైతం ఇలాగే ఆలోచించి.. ప్రమోషన్స్ భారతదేశంలోనే నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా తెలుగు వర్షన్‌కు సంబంధించి డిసెంబర్ 2న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారట. ఆ తర్వాత వరుసగా వేరే భాషల్లోనూ ట్రైలర్ లాంచ్ వుంటుందని మెగా కాంపౌండ్ టాక్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus