ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ఐదు రోజుల ముందు ఎవరూ ఊహించని విధంగా వాయిదా పడింది. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆర్ఆర్ఆర్ మేకర్స్ మరోసారి వెనక్కు తగ్గక తప్పలేదు. ఓవర్సీస్ లో చాలామంది ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ కు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. సాధారణ టికెట్ రేట్లతో పోలిస్తే మూడు రెట్లు టికెట్ రేటు ఎక్కువగానే ఉన్నా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామని యూఎస్ ప్రేక్షకులు చెబుతున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడటంతో ఓవర్సీస్ లో టికెట్లను బుకింగ్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ విడుదలై ఉంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త కలెక్షన్ల రికార్డులు కచ్చితంగా క్రియేట్ అయ్యి ఉండేవని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ ప్రేక్షకులలో టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు టికెట్ ధరను రీఫండ్ చేస్తారని సమాచారం.
అయితే టికెట్ రేట్లతో పాటు ప్రేక్షకులు చెల్లించిన కన్వీనియన్స్ ఫీజులను మాత్రం కోల్పోయే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు కొంత మొత్తాన్ని నష్టపోక తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత స్పష్టత రానుంది. సమ్మర్ లో వరుసగా పెద్ద సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారడం వల్ల నిర్మాత దానయ్యపై వడ్డీ రూపంలో ఊహించని స్థాయిలో భారం పెరుగుతోందని బోగట్టా. అయితే దానయ్య మాత్రం సినిమా రిలీజైన తర్వాత భారీ మొత్తంలో లాభాలు వస్తాయని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పదేపదే మారడం రాజమౌళిని కూడా తెగ టెన్షన్ పెడుతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.