పవన్ కల్యాణ్ నాలుగేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో ‘వకీల్‌సాబ్’ ప్రమోషన్స్‌ను ఓ రేంజిలో చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు తమన్ లాంటివాళ్లే ఇటీవల ప్రచార కార్యక్రమాల్లో కనిపించారు. ఒకసారెప్పుడో నిర్మాత దిల్ రాజు కూడా కనిపించారు. దీంతో సినిమా ప్రచారం ఆ రేంజిలో లేదనే చెప్పాలి. దీంతో సినిమా ఊపును పెంచాలని దిల్ రాజు ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే అది వీలయ్యేలా కనిపించడం లేదు.
‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ వేడుకకు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. యూసుఫ్‌గూడలోని మొదటి పటాలం మైదానంలో వకీల్‌సాబ్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు సినిమా టీమ్ ప్లాన్స్ వేసుకుంది. దాదాపు 5వేల నుంచి 6 వేల మంది ఈ వేడుకకు హాజరవుతారని, అనుమతి కావాలంటూ ఈవెంట్ ఆర్గనైజర్లు పోలీసులను కోరారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ ప్రీ రిలీజ్ వేడుక జరగకపోతే ప్రచారంలో జోష్ పెంచడానికి దిల్ రాజు ఏం చేస్తారనేది చూడాలి. మామూలుగా దిల్ రాజు దగ్గర ఇలాంటి విషయాల్లో ప్లాన్ బి ఉంటుంది. మరి ‘వకీల్ సాబ్’ విషయంలో ప్లాన్ బి ఏంటి అనేది చూడాలి. ఏదో స్థలంలో ఈవెంట్ పెడతారా? లేక ఆన్‌లైన్ ఈవెంట్లు లాంటివి పెడతారా అనేది తెలియాలి.