‘దొంగల బండి’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న అటు తరువాత `శతమానం భవతి` చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా నేషనల్ అవార్డుని కూడా రప్పించాడు. అటు తరువాత ‘శ్రీనివాస కళ్యాణం’ కొంతమందిని మెప్పించినప్పటికీ కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది.ఇక ఏడాది వచ్చిన `ఎంత మంచివాడవురా’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.దీంతో ఈసారి ఫ్యామిలీ డ్రామా కాకుండా `కోతి కొమ్మచ్చి` అనే యూత్ ఫుల్ డ్రామాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు సతీష్ వేగేష్న.
దానికి సంబంధించి న ఫస్ట్ లుక్ ను కూడా ఈరోజు విడుదల చేసారు. దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు సతీష్ వేగేశ్న కొడుకు సమీర్ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు.ఈరోజు సతీష్ వేగేష్న పుట్టినరోజు కావడంతో ఫస్ట్ లుక్ ను విడుదల చేసినట్టు స్పష్టం అవుతుంది. ఈ చిత్రంలో కామెడీ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయట.
ఈ చిత్రంతో దర్శకుడు సతీష్ హిట్టు కొట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలి అలాగే తన కొడుకుని అలాగే శ్రీహరి కొడుకుని హీరోలుగా నిలబెట్టాలి.అంటే ఇది చాలా టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నటీ నటుల వివరాల్ని అలాగే సాంకేతిక నిపుణుల వివరాల్ని అతి త్వరలో ప్రకటించనున్నారు.