Adipurush: ‘ఆదిపురుష్’ టీమ్ బిగ్ సర్ప్రైజ్!

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ వైడ్ గా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అక్కడవరకు బాగానే ఉంది కానీ వాటిని నిలబెట్టుకునే సినిమాలను మాత్రం తీయలేకపోతున్నారు. అది అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఈ సంగతిలా ఉంటే.. మరోపక్క ప్రభాస్ చేస్తోన్న సినిమాలకు సరైన ప్రమోషన్స్ లేకపోవడం, టైమ్ కి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ని మరింత బాధిస్తుంది. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ రెండు సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది.

ఆ సమయంలో యూవీ క్రియేషన్స్ వారి మీద ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో అది రిపీట్ అవ్వదనుకున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ వాళ్లు ప్రమోషన్స్ లో కొంచెం యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ‘ఆదిపురుష్’ టీమ్ హడావిడి చేస్తుందేమో అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తుంది. సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతున్నా.. ఇప్పటివరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయలేదు.

ఈ విషయంలో తీవ్ర నిరాశకు గురైన ప్రభాస్ ఫ్యాన్స్ అక్టోబర్ 23న.. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ముంబై మీడియా దర్శకుడు ఓం రౌత్ ను ప్రశ్నించగా.. ఆయన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.

ప్రభాస్ పుట్టినరోజు నాడు కచ్చితంగా ట్రీట్ ఉంటుందని.. అది కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదని.. చాలా పెద్ద సర్ప్రైజ్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. అక్టోబర్ 23న ‘ఆదిపురుష్’ టీజర్ వస్తుందేమోనని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ప్రభాస్ పుట్టినరోజు నుంచి ప్రమోషన్స్ షురూ చేసే ఛాన్స్ ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus