బిగ్‌బాస్‌ 3 తెలుగు కంటెస్టెంట్స్‌ వీరే..!

‘బిగ్ బాస్3’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ మూడో సీజన్ జులై 21 నుండీ ప్రారంభం కానుంది. అంటే మరో రెండు రోజుల్లో అన్న మాట. ఇక ఈ షో పై వివాదాలు చాలా తలెత్తినప్పటికీ.. వాటి ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చని మీడియా వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా ఈ పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. శ్రీముఖి, హిమజ వంటి వారు కన్ఫార్మ్ అయినట్టు తాజా సమాచారం. అయితే ‘బిగ్ బాస్ 2’ సెలెబ్రిటీ నూతన్ నాయుడు ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్లు వీళ్ళేనంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

‘100 కు 100 శాతం కన్ఫామ్. వెళ్ళే ‘బిగ్ బాస్3’ సీజన్ కంటెస్టెంట్లు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు నూతన్ నాయుడు. ఇంతకీ నూతన్ నాయుడు ప్రకటించిన లిస్టులో… సినీ నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్ -వితికా షెరు(దంపతులు), టీవీ ఆర్టిస్ట్ రవికృష్ణ, అలీ రెజా, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేష్ విట్టా, సీరియల్ నటి రోహిణి, డబ్‌ స్మాష్ స్టార్ అశు రెడ్డి ఉన్నారు. వీరితో పాటు టీవి 9 ‘ముఖాముఖీ’ కార్యక్రమంతో పాపులర్ అయిన జాఫర్ కూడా ఉన్నాడు. మరి నూతన్ నాయుడు ప్రకటించిన ఈ లిస్ట్ ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

హేమ

శ్రీముఖి

తీన్మార్ సావిత్రి

హిమజా రెడ్డి

నటుడు వరుణ్ సందేశ్ -వితికా షెరు(దంపతులు)

రవికృష్ణ

అలీ రెజా

పునర్వీ భూపాలం

కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

సింగర్ రాహుల్ సిప్లిగంజ్

యూట్యూబ్ కామెడీ స్టార్ మహేష్ విట్టా

సీరియల్ నటి రోహిణి

అశు రెడ్డి

జాఫర్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus