బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో రెండో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే వాళ్ల కోసం బిగ్‌బాస్ పడవ ప్రయాణం కాన్సప్ట్ సిద్ధం చేశాడు. పడవలో అందరినీ ఎక్కించి, ఒక్కో తీరం దగ్గర ఒకరిని దిగమన్నాడు. అలా దిగినవాడు నామినేట్ అయినట్లు అని చెప్పాడు. అలా తొమ్మిది తీరాల్లో తొమ్మిదిసార్లు పడవ ఆగుతుందని, ఆగి హారన్ కొట్టినప్పుడు పడవ దిగాలని సూచించాడు. అయితే టాస్క్ మధ్యలో దిగిపోయినవాళ్లు కూడా నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు.
పడవలో అందరూ చర్చించుకొని ఒక్కొక్కరుగా దిగాలని తొలుత నిర్ణయించుకున్నారు. అలా తొలుత నోయల్ పడవ దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఎలిమినేషన్‌లో నిలవడానికి అంగీకరించాడు. ఆ తర్వాత మోనాల్, అభిజీత్, సోహైల్ దిగాలని అనుకున్నారు. తొలి హారన్ మోగగా నోయల్ దిగడానికి సిద్ధమైపోయాడు. అయితే మధ్యలో గంగవ్వ ‘నువ్వు ఆగు..’ అని దిగిపోయింది. ఎట్లయినా 9 మంది దిగాలి కదా… అని నేను ముందు దిగేశా అంటూ ఫుల్ క్లారిటీతో గేమ్ ఆడేసింది గంగవ్వ. రెండో సైరన్‌కి నోయల్ దిగేశాడు. మూడో సైరన్‌కి మోనాల్ బయటికొచ్చేసింది.
కుమార్ సాయి మొత్తం కాన్సెప్ట్‌ను కన్‌ఫ్యూజ్ చేసేశాడు. ‘మీరు వెళ్లమని చెబితే దిగిపోతాను’ అంటూ కుమార్ సాయి పాయింట్ తెచ్చాడు. దానిపై అందరూ చర్చించి ఆఖరికి కుమార్ సాయిని తొమ్మిదో వాడిగా దిగిపోమన్నారు. నాలుగో సైరన్‌కు సోహైల్ దిగిపోయాడు. ఐదోసారి సైరన్ మోగగానే కళ్యాణి నామినేట్ అయిపోయింది. ఆరో సైరన్‌కు అమ్మ రాజశేఖర్ దిగిపోగా, ఏడో సైరన్‌కు కుమార్ సాయి బయటకు వచ్చేశాడు. మన మీద నెట్టేయడానికే అలా వెళ్లిపోయాడు అని అఖిల్ అన్నాడు. అయినా మనమేమైనా బిగ్‌బాస్.. ఛాన్స్‌లివ్వడానికి… అందరం కంటెస్టెంట్సే కదా అని గొణిగాడు కూడా.
ఎనిమిదో సైరన్‌కి హారిక నామినేట్ అవ్వడానికి దిగిపోయింది. ఇక తొమ్మిదో సైర్ మోగేసరికి అభిజీత్ లేచి ‘నెక్ట్స్ మండే ఇదే టైమ్ టీ పెడతావా’ అంటూ సుజాతను అడిగాడు. అంటే కచ్చితంగా అభిమానులు తనకు ఓట్లేసి మళ్లీ ఎలిమినేషన్ నుంచి బయట పడేస్తాడని అభిజీత్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అలా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి గంగవ్వ, నోయల్, మోనాల్, సోహైల్, కళ్యాణి, రాజశేఖర్, కుమార్, హారిక, అభిజీత్ నామినేట్ అయ్యారు.
Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!